
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 84


డబుల్ ఇస్మార్ట్- సంజయ్ దత్ డబ్బింగ్ కంప్లీట్

పవన్, బన్నీ సినిమాలపై అనసూయ అప్‌డేట్స్

తలైవా కోసం విలన్ గా?

మిస్టర్ బచ్చన్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ అప్పటినుండే

శివం భజే ట్రైలర్ హైలైట్స్

కమిటీ కుర్రోళ్లు.. ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్

VD12 లీకులపై మేకర్స్ రియాక్షన్

రీ రిలీజ్‌కి సిద్దమైన 'ఎటో వెళ్లిపోయింది మనసు'

శివన్న 131.. బిగ్ అప్‌డేట్

ఘనంగా కోడి రామకృష్ణ 75వ జయంతి వేడుకలు

మీనాక్షి చేతిలో 6 సినిమాలు

హనుమాన్ నిర్మాతల చేతికి డబుల్ ఇస్మార్ట్

సూర్య 44 గ్లింప్స్ రిలీజ్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేషనల్ వైడ్ గా టాప్ ట్రెండ్ లో హరోంహర
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా హరోంహర. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కుప్పం ప్రాంత నేపథ్యంలో 1980 పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. రిలీజ్ కు ముందే ఈసినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా రీసెంట్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ నే సొంతం చేసుకుంది. సుదీర్ బాబు అద్భుతమైన నటన.. స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం స్లాంగ్‌లో డైలాగ్ డెలివరీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

పురుషోత్తముడు హోల్ సమ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "పురుషోత్తముడు". ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. "ఆకతాయి", "హమ్ తుమ్" చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా జులై26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న దర్శకుడు రామ్ భీమన, నిర్మాత డా.రమేష్ తేజావత్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు…

రాయన్ లో క్యారెక్టర్ నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది
నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ యాక్టర్‌గా తన 50 మైల్ స్టోన్ మూవీ 'రాయన్'కి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో హీరో సందీప్ కిషన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

డబుల్ ఇస్మార్ట్- సంజయ్ దత్ డబ్బింగ్ కంప్లీట్
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఆగష్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చంది.

పవన్, బన్నీ సినిమాలపై అనసూయ అప్‌డేట్స్
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, యాంకర్ టర్న్డ్ యాక్ట్రెస్ అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం సింబా. మురళి మనోహర్ దర్శకత్వం వహిస్తుండగా.. సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 09న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ వేడుకను మేకర్స్ నిర్వహించగా నటి అనసూయ పాల్గొంది.

తలైవా కోసం విలన్ గా?
ఈ ఏడాది లాల్ సలామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తలైవా రజినీకాంత్. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం తను పలు సినిమాలో బిజీగా ఉన్నాడు. వాటిలో ఇప్పటికే వెట్టైయాన్ సినిమా షూటింగ్ ముగించుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఈసినిమాలో మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మిస్టర్ బచ్చన్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మరోసారి థియేటర్లలోకి 'ఇంద్ర'
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులోకి మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ఒకటి చేరబోతోంది. ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలలో ఒకటైన 'ఇంద్ర' సినిమా మళ్లీ విడుదలకు సిద్ధమైంది. ఇండస్ట్రీ హిట్ అయిన ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయాలని మెగా అభిమానులు ఎప్పటినుంచో మేకర్స్‌ను కోరుతున్నారు. ఇన్నాళ్లకు వారి ఎదురుచూపులకు తెరపడింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ త్వరలోనే మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.

గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ అప్పటినుండే
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఈసినిమా గురించి అప్ డేట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. అప్పుడెప్పుడే జరగండి జరగండి అంటూ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత ఇప్పటివరకూ సాలిడ్ అప్ డేట్ ఇచ్చింది లేదు. మరోవైపు రిలీజ్ డేట్ పై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ముందు సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ షూటింగ్ జాప్యం వలన సెప్టెంబర్ నుండి…

SSMB29 పై రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్.. ఈ కాంబినేషన్ కోసం ఎంత మంది ఎప్పటినుండి ఆశగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియదు కానీ ఇప్పటికే ఈసినిమాపై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు కథ కూడా రాయడం కంప్లీట్ అయిపోగా.. మహేష్ కూడా తన పూర్తి ఫోకస్ ను ఇప్పుడు రాజమౌళి సినిమాపై పెట్టేశాడు. ఈసినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టేశాడు.

శివం భజే ట్రైలర్ హైలైట్స్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శివం భజే'. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‍గా నటిస్తోంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది.

కమిటీ కుర్రోళ్లు.. ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ యదు వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

VD12 లీకులపై మేకర్స్ రియాక్షన్
సినిమాలకు లీకులు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదో ఒక రకంగా లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాకు కూడా లీకుల బెడదలు తప్పలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా 12 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ను జరుపుకుంటుంది.

రీ రిలీజ్‌కి సిద్దమైన 'ఎటో వెళ్లిపోయింది మనసు'
ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. పైగా గౌతమ్ మీనన్ వంటి దర్శకులు తీసిన చిత్రాలను అయితే ఎప్పుడూ మరిచిపోలేరు. ఆయన తీసిన ఎన్నో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ ఇప్పటి తరాల్ని కూడా అలరిస్తూ ఉంటాయి. నాని, సమంత కలిసి చేసిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' అనే సినిమా కుర్రాళ్ల హృదయాల్ని హత్తుకుంది. ఈ మూవీని ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ మీద సి.కళ్యాణ్ నిర్మించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు.

శివన్న 131.. బిగ్ అప్‌డేట్
శాండల్‌వుడ్ సూపర్ స్టార్, కరుణాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ (శివన్న) అభిమానులకు బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఆయన తన 131వ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇటీవల, ప్రొడక్షన్ టీం శివన్న పుట్టినరోజున ఇంట్రడక్షన్ టీజర్‌ను విడుదల చేసి అభిమానులను ఉత్సాహపరిచింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శివన్న డిఫరెంట్ క్యారెక్టర్ కనిపించనున్నాడు. ఇప్పుడు ఈ సినిమా మేకింగ్‍కి చిత్ర యూనిట్ సిద్ధమైంది.

ఘనంగా కోడి రామకృష్ణ 75వ జయంతి వేడుకలు
టాలీవుడ్ చరిత్రలో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకులు అరుదు. అలాంటి అరుదైన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామకృష్ణ. విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తూ ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టుకు ఎక్కుతూ శతాధిక దర్శకుడిగా పేరు తెచ్చుకుని గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు సంపాదించుకున్నారు.

మీనాక్షి చేతిలో 6 సినిమాలు
యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6సినిమాలు చేస్తుంది.ఇందులో దాదాపు అన్ని క్రేజీ ప్రాజెక్టులే వున్నాయి.ఈసినిమాల విషయానికి వస్తే…

హనుమాన్ నిర్మాతల చేతికి డబుల్ ఇస్మార్ట్
ఉస్తాద్ రామ్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యింది.హనుమాన్ నిర్మాతలు ఈ థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు.కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే కాదు కన్నడ,మలయాళ, తమిళ, హిందీ భాషల రైట్స్ తోపాటు ఓవర్సీస్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారు.సినిమా మీద వున్న నమ్మకంతో ఫ్యాన్సీ రేటు కు ఈరైట్స్ దక్కించుకున్నారు.

మనమే ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ
టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ కు మంచి హిట్ దక్కి చాలా కాలమైంది. వరుస పరాజయాల తరువాత రెండేళ్ల క్రితం వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈఏడాది మనమే అంటూ వచ్చేశాడు. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. చాలా కాలం తరువాత శర్వా మళ్లీ ఎనర్జిటిక్ రోల్ తో వచ్చినా ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

సూర్య 44 గ్లింప్స్ రిలీజ్
స్టార్ట్ హీరో సూర్య ప్రస్తుతం తన 44వ సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమా నుండి తన బర్త్ డే సందర్భంగా నిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అదిరిపోయింది.ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు.సూర్య లుక్ ,స్వాగ్ ఆకట్టుకున్నాయి.గ్లింప్స్ చూస్తుంటే సూర్య నుండి చాలా రోజుల తరువాత పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ రానుందనిపిస్తుంది.డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చేశాడు.ఓవరాల్ గా ఈ ప్రోమో అయితే సూర్య అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది.