కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Cinema News 2024

ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 72

Global Star Ram Charan Launched Maruthi Nagar Subramanyam Trailer
ట్రైలర్ & టీజర్

రామ్ చరణ్ చేతుల మీదుగా.. రావు రమేష్ మూవీ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ తొలిసారి కథానాయకుడిగా నటించిన చిత్రం 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో రావు రమేష్ సరసన ఇంద్రజ కథానాయికగా నటించగా.. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు.

Srikanth Mవాట్సాప్
Dulquer Salmaan's New Movie Titled Aakasam Lo Oka Tara
సినిమా వార్తలు

దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా.. ఆకాశంలో ఒక తార

మలయాళ సూపర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్..తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాదు, ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. వైవిధ్య‌మైన పాత్ర‌లు, సినిమాల‌తో త‌న‌దైన ముద్రవేశారీ అగ్ర కథానాయ‌కుడు. తెలుగులోనూ మ‌హాన‌టి, సీతారామం వంటి సూప‌ర్ హిట్ చిత్రాల్లో అద్భుత‌మైన న‌ట‌న‌తో ఈయ‌న అల‌రించిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా విడుద‌లైన పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ క‌ల్కి 2898 ఏడీలోనూ అతిథి పాత్ర‌లోనూ దుల్క‌ర్ అల‌రించారు.

Srikanth Mవాట్సాప్
Mechanic Rocky Glimpse Launch Update
ట్రైలర్ & టీజర్

మెకానిక్ రాకీ గ్లింప్స్ లాంచ్ అప్‌డేట్

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మెకానిక్‌ రాకీ'. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్నాడు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ కూడా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
dulquer salmaan lucky bhaskar movie title track release date fixed
రిలీజ్ అప్‌డేట్

లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్ రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే సీతారామం సినిమాతో సూపర్ హిట్ కొట్టి తెలుగులో మంచి మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో దుల్కర్ హీరోగా వస్తున్న సినిమా లక్కీ భాస్కర్. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో దుల్కర్ బ్యాంక్ క్యాషియర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ శ్రీమతి గారు పాట మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
డబుల్ ఇస్మార్ట్ సాంగ్‍లో కేసీఆర్ డైలాగ్.. మణిశర్మ క్లారిటీ
సాంగ్

డబుల్ ఇస్మార్ట్ సాంగ్‍లో కేసీఆర్ డైలాగ్.. మణిశర్మ క్లారిటీ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనందరికీ ఎంతో ఇష్టమైన నాయకుడని, ప్రతి ఒక్కరికీ ఆయన పేవరెట్ లీడర్ అని పేర్కొన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ. ఈ మేరకు ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ మాజీ సీఎంపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల మణిశర్మ కంపోజ్ చేసిన ఒక పాటలో సీఎం కేసీఆర్ పాపులర్ డైలాగ్ వాడటంపై వివాదం నెలకొంది.

Srikanth Mవాట్సాప్
allu sirish clarity on pushpa 2 movie delay
సినిమా వార్తలు

పుష్ప2- ఎలాంటి ఆలస్యం లేదు

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
ram pothineni double ismart movie third single release date fixed
రిలీజ్ అప్‌డేట్

డబుల్ ఇస్మార్ట్ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా ఎప్పటి నుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈమధ్య కాలంలో పలు సినిమాలతో వచ్చినా ఏ సినిమా కూడా విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు తన హోప్స్ అన్నీ డబుల్ ఇస్మార్ట్ పైనే ఉన్నాయి. ఈసినిమా పూరీ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
nithiin robinhood makers planning for new release date
రిలీజ్ అప్‌డేట్

రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ వాయిదా ప్లాన్?

టాలీవుడ్ హీరో నితిన్ కు సాలిడ్ హిట్ దక్కి కూడా చాలా రోజులైపోయింది. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను రాబిన్ హుడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకీ కుడుముల ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Niharika Konidela's Committee Kurrollu Trailer Out
ట్రైలర్ & టీజర్

కమిటీ కుర్రోళ్ళు.. ట్రైలర్ రిలీజ్

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ య‌దు వంశీ ద‌ర్శ‌కత్వం వహిస్తుండగా.. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 9న కమిటీ కుర్రోళ్ళు విడుద‌లకానుంది.

Srikanth Mవాట్సాప్
abhirami role revealed from nani saripodhaa sanivaaram movie
ఫస్ట్ లుక్

సరిపోదా శనివారం నుండి అభిరామి ఫస్ట్ లుక్ రిలీజ్

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు వచ్చాయి. అన్నీ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాయి. రీసెంట్ గానే ఎస్ జే సూర్య పుట్టినరోజు సందర్బంగా ఆయన గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ram pothineni creates new record with hindi dubbed movies
సినిమా వార్తలు

హిస్టరీ క్రియేట్ చేసిన రామ్- టాలీవుడ్ లో ఒకే ఒక్క హీరో

తెలుగు సినిమాలకు ఇప్పుడు హిందీలో కూడా మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే మన తెలుగు సినిమాలను హిందీలో రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు పలు సినిమాలు అక్కడ సాలిడ్ రెస్పాన్స్ ను అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయేమో కానీ నార్త్ లో మన హవా అంతగా లేనప్పుడే ఒక హీరో డబ్బింగ్ సినిమాలు మాత్రం యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాలు 100మిలియన్ వ్యూస్ ను సాధించడమంటే మాములు విషయం కాదు. మరి ఆ ఘనత సాధించిన హీరో ఎవరో కాదు టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్…

TFN Adminవాట్సాప్

షేర్