
ట్యాగ్ · 7 కథనాలు


రేపు ఏకంగా 9 సినిమాలు రిలీజ్

ఫస్ ప్లస్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టక్కర్ ట్రైలర్

సిద్దార్ధ్ టక్కర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సిద్ధార్ద్ టక్కర్ టీజర్ రిలీజ్

టక్కర్ ఫస్ట్ డే కలెక్షన్స్
కార్తిక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా 'టక్కర్'. ఈసినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉండటంతో సినిమాకు మంచి పాజిటివ్ టాకే దక్కింది. అంతేకాదు మొదటిసారి సిద్దార్థ్ మాస్ రోల్ లో నటించి మెప్పించాడు. దీంతో ఈసినిమాా కలెక్షన్స్ ను కూడా బాగానే రాబట్టుకుంది.

సిద్దార్ధ్ టక్కర్ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే సిద్దార్థ్ ను కొత్తగా చూడాలనుకునే వారు ఈసినిమాను చూడొచ్చు. అలానే థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునే వారు ఈసినిమా చూడొచ్చు..

రేపు ఏకంగా 9 సినిమాలు రిలీజ్
ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సినిమాలు క్యూ కడుతున్నాయి.అయితే ఈ సారి ఈ సంఖ్య చాలా ఎక్కువగా వుంది.ఏకంగా 9సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.ఇందులో ఒకటి రీ రిలీజ్ సినిమా కూడా వుంది.ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఫస్ ప్లస్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టక్కర్ ట్రైలర్
హీరో సిద్దార్థ్ తన సినిమాలతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆతరువాత కొత్త కొత్త హీరోలు రావడం.. మరోవైపు సిద్దార్థ్ కూడా వరుస పరాజయాలు అందుకోవడంతో సినిమా అవకాశాలు కాస్త తగ్గాయి. మళ్లీ ఇప్పుడు కెరీర్ లో నిలదొక్కుకుంటున్నాడు. ఈమధ్యే మహా సముద్రం అంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కార్తిక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'టక్కర్'. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఈసినిమా జూన్ 9వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.

సిద్దార్ధ్ టక్కర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కార్తిక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'టక్కర్'. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మహా సముద్రం తరువాత తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కూడా కూడా ముగించుకుంటుంది. అంతేకాదు ప్రమోషన్స్ కూడా ఎప్పటినుండో మొదలుపెట్టి టీజర్ కూడా రిలీజ్ చేసేశారు. టీజర్ ను బట్టి ఈసినిమా ఒక పేదింటి యువకుడు..డబ్బున్న అమ్మాయి మధ్య జరిగే కథలాగా అర్థమవుతుంది.

సిద్ధార్ద్ టక్కర్ టీజర్ రిలీజ్
'బోయ్స్', 'బొమ్మరిల్లు', ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,'ఓయ్' ఇలా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు సిద్ధార్థ్. ఇక ప్రస్తుతం వున్న పోటీ వాతావరణంలో కాస్త వెనకబడిపోయాడు. అప్పుడప్పుడు ఒక్కో సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగానే ఉన్నాడు. ఇక నేడు సిద్దార్థ్ పుట్టినరోజు కావడంతో తన సినిమాల నుండి అప్ డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ 2 నుండి బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా తను ప్రధాన పాత్రలో చేస్తున్న టక్కర్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
కొత్త సినిమాపై వస్తున్న రూమర్లకు చెక్..!
ఇటీవలే 'వదలడు' సినిమాతో వచ్చిన సిద్దార్ధ్ ఇప్పుడు తాజాగా మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'టక్కర్'. నిజానికి ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తెలిసిందే కదా కరోనా వల్ల రిలీజ్ కు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో అన్ని సినిమాలకు వస్తున్నట్టే... ఈ సినిమాకు పై కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సిద్దార్ధ ఈ వార్తలన్నిటినీ ఖండించాడు. తమ సినిమా థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని.. ఎప్పుడు లాక్ డౌన్ అయిపోయి ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ చేస్తారో అప్పటి వరకూ వెయిట్ చేస్తామని చెప్పాడు.