
ట్యాగ్ · 7 కథనాలు


సురేష్ ప్రొడక్షన్స్ కొత్త సినిమా అప్ డేట్
'సురేష్ ప్రొడక్షన్స్' నుండి మరో కొరియన్ రీమేక్

హ్యాట్రిక్ కొట్టిన ఎస్పీ ప్రొడక్షన్స్

సురేష్ ప్రొడక్షన్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ డిటైల్స్

60 ఏళ్లు పూర్తి చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్
పద్మ భూషణ్, మూవీ మొఘల్, దివంగత లెజెండరీ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారు స్థాపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. తాజాగా 60 ఏళ్ల అద్భుత సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని వైభవోత్సవాలు జరుపుకుంటోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా ప్రేక్షకుల మన్ననలని పొందిన సురేష్ ప్రొడక్షన్స్ 60 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో శతాధిక చిత్రాలను ప్రేక్షకులకందించి చరిత్ర సృష్టించింది.

సురేష్ ప్రొడక్షన్స్ కొత్త సినిమా అప్ డేట్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఇప్పుడు ఒక కొత్త సినిమాను అనౌన్స్ చేసింది.సురేష్ ప్రొడక్షన్స్ , ఇంట్రోయూప్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై నాని బండ్రెడ్డి దర్శకత్వంలో జై , అనంతిక జంటగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్"రాజమండ్రి రోజ్ మిల్క్"మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో వెన్నెల కిషోర్ , ప్రవీణ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి గోవింద్ వసంత , యశ్వంత్ నాగ్ , భరత్ శౌరభ్ , అజయ్ అరసదా సంగీతం అందిస్తున్నారు.

'మానాడు' హక్కులను దక్కించుకున్న 'సురేష్ ప్రొడక్షన్స్'
దగ్గుబాటి వారి హోమ్ బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుండి ఈ బ్యానర్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించింది.. అందిస్తూనే ఉంది. ఇక ఈ బ్యానర్ నుండి స్ట్రయిట్ సినిమాలు ఎలా అయితే వస్తాయో రీమేక్ సినిమాలు కూడా అలానే వస్తాయి. ఇప్పటి వరకూ ఇతర భాషల్లోని ఎన్నో సినిమాలను రీమేక్ చేశారు. ఇక ఈనేపథ్యంలో ఇప్పుడు మరో సినిమా రీమేక్ లను సొంతం చేసుకుంది ఈ బ్యానర్. ఆ సినిమా మరేదో కాదు ఇటీవలే రిలీజ్ అయిన మానాడు.
'సురేష్ ప్రొడక్షన్స్' నుండి మరో కొరియన్ రీమేక్
మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో సురేష్ ప్రొడక్షన్ కూడా ఒకటి. ఎన్నో ఏళ్ల క్రితం స్థాపించిన ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు నిర్మించబడ్డాయి. అటు పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా తమ ప్రొడక్షన్ హౌస్ నుండి రిలీజ్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారు.
రానా ట్వీట్ కు సురేష్ ప్రొడక్షన్స్ ఫన్నీ రిప్లై..!
ఎలాంటి హడావుడి లేకుండా రానా తనకు కాబోయే భార్యను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసి ఒక రేంజ్ లో షాక్ ఇచ్చాడు రానా. నిజానికి వేరే ఏదైనా హీరో అయితే ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదేమో. మొదటినుండి పెళ్లి, ప్రేమ అనే విషయాలు ఇంట్రెస్ట్ లేనట్టు ఉండే రానా ఇప్పుడు ఇలా చేయడంతో ఇంత రేంజ్ లో సోషల్ మీడియా వేదికగా చర్చలు జరిగాయి. ఇక కొంత మంది టాలీవుడ్ హీరోలు కూడా చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతూ ట్వీట్స్ చేశారు. ఇక రానా పెళ్లిపై వచ్చిన ఫన్నీ మీమ్స్ అయితే పీక్స్ లెవెల్. అందరు సంగతి ఏమోకానీ ముందు ప్రభాస్ కు మాత్రం భజన స్టార్ట్ అయింది.

హ్యాట్రిక్ కొట్టిన ఎస్పీ ప్రొడక్షన్స్
సురేష్ ప్రొడక్షన్స్... తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాప్ ప్రొడక్షన్ సంస్థలలో ఒకటి. ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. అంతేకాదు ఎంతో మంది హీరో హీరోయిన్స్ కూడా ఈ సంస్థ ద్వారా పరిచయమయ్యారు. అందుకే మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు ఈ సంస్థను స్థాపించి దాదాపు 55 ఏళ్ళు కావస్తున్నా కూడా ఏనాడూ వెనుకపడలేదు. రామానాయుడుతో పాటు పలు సినిమాలను నిర్మిస్తూ.. రామానాయుడు అనంతరం...ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు సురేష్ బాబు.. ఇప్పుడైతే అటు పెద్ద సినిమాలను నిర్మిస్తూనే.. చిన్న సినిమాలకు కూడా మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఒక రకంగా చిన్న సినిమాలకు ఎస్పీ…

సురేష్ ప్రొడక్షన్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ డిటైల్స్
సురేష్ ప్రొడక్షన్స్… దేశం గర్వించదగ్గ చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటి. పరాజయాలలోనూ అవకాశాలుంటాయని నమ్మిన సంస్థ. అందుకే 55 ఏళ్ళుగా తమ సంస్థలో పలు చిత్రాలను నిర్మించి ఘన విజయాలను సొంతం చేసుకుంటోంది. మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు స్థాపించిన ఈ సంస్థను ఆయన తనయుడు డి.సురేష్ బాబు ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మించనున్నట్టు అధినేత సురేష్ బాబు స్వయంగా వెల్లడించారు.