
ట్యాగ్ · 6 కథనాలు

నో పాలిటిక్స్ అంటున్న తలైవా
కోలుకున్న రజినీ.. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్
అస్వస్థతకు గురైన 'తలైవా'
'అన్నాత్తే' సిబ్బందికి కరోనా - ఆగిపోయిన షూటింగ్

రజినీకాంత్ అరుదైన రికార్డ్

వీర సింహారెడ్డి మూవీ పై తలైవా రజనీకాంత్ ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…
నో పాలిటిక్స్ అంటున్న తలైవా
అభిమానులకు కాస్త నిరాశ పరిచే వార్తే చెప్పారు తలైవా, సూపర్ స్టార్ రజినీ కాంత్. రజినీ పొలిటికల్ ఎంట్రీ పై ఎప్పుడూ ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక ఎంతో కాలంగా రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అభిమానులతో పాటు అందరూ ఎదురుచూస్తున్నారు . అయితే ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నానని.. డిసెంబర్ 31న తన పార్టీ పేరుని అనౌన్స్ చేస్తానని, జనవరిలో పార్టీని స్టార్ట్ చేస్తానని ఆయన తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజు కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే మరో ట్విస్ట్ ఇచ్చారు రజినీ.
కోలుకున్న రజినీ.. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్
మొత్తానికి రజినీ అభిమానులకు కాస్త ఊరట లభించింది. సూపర్ స్టార్ రజినీ కాంత్ అస్వస్థతకు గురైన వార్త అటు సినీ పరిశ్రమలనే కాదు అభిమానులను సైతం ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. హైబీపీతో బాధపడుతున్న రజినీ.. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరిన సంగతి కూడా విదితమే. అయితే ప్రస్తుతం రజినీ ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి అనారోగ్యం లేదని అయితే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇక మూడు రోజుల నుంచి హాస్పిటల్ లో ఉన్న రజినీ డిశ్చార్జ్ అయ్యారు
అస్వస్థతకు గురైన 'తలైవా'
సూపర్ స్టార్ రజినీ కాంత్ అస్వస్థతకు గురైన వార్త అటు సినీ పరిశ్రమలనే కాదు అభిమానులను సైతం ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం రజినీ అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైద్రాబాద్ లో ఉన్నారు. అయితే చిత్ర సిబ్బందిలో దాదాపు 4గురికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం రజినీ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
'అన్నాత్తే' సిబ్బందికి కరోనా - ఆగిపోయిన షూటింగ్
శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ అన్నాత్తే సినిమా షూటింగ్ జరుగుతుంది.

రజినీకాంత్ అరుదైన రికార్డ్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "దర్బార్" మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషలలో సంక్రాంతి కానుక గా 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో 200కోట్ల క్లబ్ లో చేరింది."దర్బార్" మూవీతో ఏ సౌత్ ఇండియన్ స్టార్ కు లేని అరుదైన రికార్డ్ ను రజినీకాంత్ నెలకొల్పారు.