
ట్యాగ్ · 8 కథనాలు


హంట్ మూవీ యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో రిలీజ్

'సుధీర్ బాబు' యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ ప్రారంభం..!

మరో కొత్త సినిమాను ప్రారంభించిన 'సుధీర్'

ఎన్టీఆర్ పై సుధీర్ బాబు ప్రశంసలు

సెన్సార్ పూర్తి చేసుకున్న సుధీర్ బాబు హంట్
మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హంట్. యాక్షన్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు. ఈ సినిమాకు సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికెట్ ని అందజేశారు. దీంతో ఈసినిమా రిలీజ్ సిద్దమైంది.

హంట్ మూవీ యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో రిలీజ్
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ సూరపనేని దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా యాక్షన్ థ్రిల్లర్ హంట్ మూవీ జనవరి 26 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ కీలక పాత్రల్లో నటించారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి ముఖ్య పాత్రలలో నటించారు. గిబ్రాన్ సంగీతం అందించారు. ది చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సుధీర్ బాబు న్యూ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ రిలీజ్
"శివ మనసులో శృతి "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు సక్సెస్ ఫుల్ "ప్రేమ కథా చిత్రమ్", "సమ్మోహనం " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "V" మూవీ లో డి సి పి ఆదిత్య గా సుధీర్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సుధీర్ బాబు ప్రస్తుతం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి", హర్షవర్ధన్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటిస్తున్నారు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ మూవీ కి సుధీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'సుధీర్ బాబు' యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ ప్రారంభం..!
చిన్న పాత్రల ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన సుధీర్ బాబు ఆతర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. గతఏడాది “శ్రీదేవి సోడా సెంటర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబుకు ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘సమ్మోహనం’, వి తరువాత “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా హర్షవర్ధన్ దర్శకత్వంలో కూడా మరో సినిమాను చేస్తుండగా ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే స్టార్ట్ చేశారు.

మరో కొత్త సినిమాను ప్రారంభించిన 'సుధీర్'
సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది శ్రీదేవి సోడా సెంటర్ మూవీతో అలరించిన సుధీర్ బాబు ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి తో ‘సమ్మోహనం’, వి తరువాత “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా త్వరలో రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమా చేస్తూనే మరోవైపు హర్షవర్థన్ దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా షూటింగ్ ను చేస్తున్నాడు. తన కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈసినిమాను సోనాలి నారంగ్, సృష్టి సమర్ఫణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి పతాకంపై ప్రొడక్షన్…

ఫుల్ స్వింగ్ లో సుధీర్ 15వ సినిమా.. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా.. నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తన కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం డిఫరెంట్ కథలను చేసుకుంటూ వెళుతున్న సుధీర్ కోసం హర్ష వర్ధన్ కూడా ఒక భిన్నమైన కథను రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఈసినిమాను అధికారికంగా ఎప్పుడో ప్రకటించినప్పటికీ సెట్స్ పైకి రావడానికి చాలా టైమే తీసుకుంది. అయితే ఈ సినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ఇక వెంటనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించగా తాజాగా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'.. డబ్బింగ్ పూర్తి చేసిన సుధీర్
గత ఏడాది శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఆసినిమాతో డీసెంట్ హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ పూర్తి కాాగా.. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు సుధీర్ బాబు. ఈసినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తయిందని తెలిపాడు.

ఎన్టీఆర్ పై సుధీర్ బాబు ప్రశంసలు
సక్సెస్ ఫుల్ "పలాస 1978 " మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు , ఆనంది జంటగా రూపొందిన "శ్రీదేవి సోడా సెంటర్ " మూవీ సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. "శ్రీదేవి సోడా సెంటర్ " మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు విడుదలకు ముందు నుండి విడుదల అయిన తర్వాత కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.