కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

SP Balasubrahmanyam Latest Health Updates

ట్యాగ్ · 5 కథనాలు

సినిమా వార్తలు

నాన్న ఆరోగ్యం మెరుగుపడుతుంది - ఎస్పీ చరణ్

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతుంది. ఆయన అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చేసిన ప్రార్ధనలు ఫలిస్తున్నాయి. ఇక బాలు హెల్త్ అప్ డేట్స్ గురించి తనయుడు చరణ్ ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం త‌న తండ్రి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని ఎస్పీ చ‌ర‌ణ్ తెలిపారు. తన తండ్రి ఈసీఎంవో సపోర్టుతో ఉన్నారని.. ఫిజియోథెరపీలో చురుకుగా పాల్గొంటున్నారని ఎస్పీ చ‌ర‌ణ్‌ పేర్కొన్నారు. తన తండ్రి త్వరగా కోలుకోవడం కోసం శ్ర‌మించిన ఆస్ప‌త్రి వైద్యుల‌కు, ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గుడ్ న్యూస్ చెప్పిన ఎస్పీ చరణ్.. నాన్నగారికి కరోనా నెగిటివ్

గ‌త కొద్ది రోజులుగా క‌రోనాతో ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక బాలు ఆరోగ్యంపై తనయుడు ఎస్పీ చరణ్ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్న సంగతి కూడా విదితమే. ఈనేపథ్యంలోనే సోమ‌వారం గుడ్ న్యూస్ రాబోతుంద‌ని చ‌ర‌ణ్ రెండు రోజుల క్రితం తెలియ‌జేశాడు. ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ ఏంటో కూడా చెప్పేశాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలు హెల్త్ అప్ డేట్ - సోమ‌వారం శుభవార్త వింటారు

కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుండి బాలుకి చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల్లో బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని కొన్నిసార్లు.. ఆరోగ్యం క్షీణించిందని ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ రూమర్స్ పై బాలు తనయుడు ఎస్పీ చరణ్ స్పందించి నాన్న ఆరోగ్యంపై వచ్చే వార్తలను నమ్మకండి.. నేనే అప్ డేట్స్ ఇస్తా అని క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు నుండి తనే అప్ డేట్స్ ఇస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
SPCharan Quashes Rumors About SP Balasubrahmanyam Health Condition
సినిమా వార్తలు

అవి రూమర్స్ - నాన్న ఆరోగ్యంపై నేనే అప్ డేట్స్ ఇస్తా..!

గత రెండు రోజుల క్రితం బాలు ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉందని చెప్పడంతో అందరూ చాలా కంగారు పడ్డారు. అయితే ఈ రోజు ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు.. ఆయనకు మరోసారి కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక బాలు ఆరోగ్యం నిలకడగా ఉందన్న వార్తలు రావటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు బాలుకి కరోనా నెగిటివ్ వచ్చిందన్న వార్తలపై ఎస్పీ చరణ్ స్పందించి ఆ వార్తలను ఖండించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కోలుకుంటున్న ఎస్పీ బాలు

కరోనా పాజిటివ్ రావడంతో గత పదిరోజులుగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు రావడంతో.. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే కోలుకుంటానని అభిమానులకు తానే స్వయంగా వీడియో ద్వారా సమాచారాన్ని అందించారు కూడా. అయితే నాలుగు రోజుల క్రితం ఎస్పీ బాలు ఆరోగ్యం బాగా క్షీణించిందని ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నామని.. నిపుణులైన డాక్టర్లు ఆయనని పర్యవేక్షిస్తున్నారని చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ డాక్టర్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇక దీనితో టాలీవుడ్ సినీ ప్రముఖులు బాలు తొందరగా కోలుకోవాలని అందరూ…

TFN Adminవాట్సాప్

షేర్