
ట్యాగ్ · 6 కథనాలు


సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినీ జర్నీ
'రంగమార్తాండ' గురూజీ మొదలుపెట్టారు
లెజెండరీ రైటర్ సోషల్ మీడియా ఎంట్రీ

`ప్రతీ రోజు పండగే`కి `సిరివెన్నెల` గీతం

సిరివెన్నెల ఆఖరి పాట పై సాయి పల్లవి స్పందన
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినీ జర్నీ
ప్రముఖ దర్శకుడు కె విశ్వనాధ్ దర్శకత్వం లో తెరకెక్కిన "సిరివెన్నెల"(1986 ) మూవీ లో విధాత తలపున సాంగ్ తో చెంబోలు సీతారామశాస్త్రి లిరిసిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. మొదటి సినిమా తోనే బెస్ట్ లిరిసిస్ట్ గా నంది అవార్డ్ అందుకున్నారు. మొదటి సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. పలు సూపర్ హిట్ మూవీస్ లో మానవతా విలువలతో కూడిన అర్ధవంతమైన సాంగ్స్ తో ప్రేక్షకులను సిరివెన్నెల ఆకట్టుకున్నారు.

ప్రముఖ గేయ రచయిత 'సిరివెన్నెల సీతారామశాస్త్రి' కన్నుమూత
మళ్లీ ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా విషాద ఛాయలు అలుముకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలను కోల్పోయింది ఇండస్ట్రీ. రీసెంట్ గానే ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనావల్ల తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా ఆయన్ని అస్వస్థతతో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స పొందుతుండగా తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస…
'రంగమార్తాండ' గురూజీ మొదలుపెట్టారు
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో 'రంగ మార్తాండ' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.
లెజెండరీ రైటర్ సోషల్ మీడియా ఎంట్రీ
1984 సంవత్సరం "జననీ జన్మభూమి "మూవీ తో గీత రచయితగా టాలీవుడ్ కు పరిచయం అయిన చెంబోలు సీతారామశాస్త్రి "సిరివెన్నెల "మూవీ కి గీత రచయిత గా పని చేసి ఆ మూవీ లోని అన్ని సాంగ్స్ ను రచించారు. ఆ మూవీ లోని "విధాత తలపున " సాంగ్ కు బెస్ట్ లిరిసిస్ట్ గా నంది అవార్డ్ అందుకున్నారు. ఆ మూవీ పేరే ఆయనకు ఇంటి పేరుగా మారింది. పలు మూవీస్ కు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన సిరివెన్నెల బెస్ట్ లిరిసిస్ట్ గా 11 నంది , 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.

`ప్రతీ రోజు పండగే`కి `సిరివెన్నెల` గీతం
`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత మెగా హీరో సాయితేజ్ నటిస్తున్న సినిమా `ప్రతీ రోజు పండగే`. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం... ప్రస్తుతం మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా కోసం... ప్రముఖ గీత రచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి ఓ సందర్భోచిత పాటని రాశారని సమాచారం.