
ట్యాగ్ · 5 కథనాలు


'ఒరేయ్ బామ్మర్ది' ట్రైలర్ రిలీజ్

హీరో సిద్ధార్ధ్ లాక్ డౌన్ సెల్ఫీ

ఫస్ ప్లస్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టక్కర్ ట్రైలర్
హీరో సిద్దార్థ్ తన సినిమాలతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆతరువాత కొత్త కొత్త హీరోలు రావడం.. మరోవైపు సిద్దార్థ్ కూడా వరుస పరాజయాలు అందుకోవడంతో సినిమా అవకాశాలు కాస్త తగ్గాయి. మళ్లీ ఇప్పుడు కెరీర్ లో నిలదొక్కుకుంటున్నాడు. ఈమధ్యే మహా సముద్రం అంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కార్తిక్ జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'టక్కర్'. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఈసినిమా జూన్ 9వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.

ఇండియన్ 2 నుండి సిద్దార్థ్ పోస్టర్ రిలీజ్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఇండియన్2 సినిమా ఒకటి. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలుసు. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈసినిమాను జూన్ నాటికి పూర్తి చేయాలని శంకర్ ఇప్పటికే వెల్లడించాడు.. ఆదిశగానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు శంకర్. ఇక్కడ షెడ్యూల్స్ ను పూర్తిచేసుకున్న ఇండియన్2 టీమ్ రీసెంట్ గానే తైవాన్ వెళ్లి అక్కడ కూడా కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. తైవాన్ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు…

'ఒరేయ్ బామ్మర్ది' రివ్యూ
ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిద్ధూ కుమార్ నేపథ్య సంగీతం. పాటలు సంగతి పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేశాడు. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

'ఒరేయ్ బామ్మర్ది' ట్రైలర్ రిలీజ్
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సిద్దార్థ్ కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అయితే ఆ మధ్య చాలా కాలం పాటు సినిమాలు చేయకుండా గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడే మళ్లీ పలు ప్రధాన మైన పాత్రలను సొంతం చేసుకుంటూ కెరీర్ ను గాడిలో పెడుతున్నాడు.

హీరో సిద్ధార్ధ్ లాక్ డౌన్ సెల్ఫీ
"బాయ్స్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన సిద్ధార్ధ్ , బ్లాక్ బస్టర్ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా "మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సిద్ధార్ధ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ "రంగ్ దే బసంతి "మూవీ తో సిద్ధార్ధ్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "బొమ్మరిల్లు ", "లవ్ ఫెయిల్యూర్ ", "జబర్దస్త్ " వంటి మూవీస్ తో సిద్ధార్ధ్ ప్రేక్షకులను అలరించారు.