
ట్యాగ్ · 6 కథనాలు


హ్యాపీ బర్త్ డే - "శాకుంతలం " టీమ్

ఎన్టీఆర్ కు జోడీ గా సామ్.. ఇదే క్లారిటీ..!

మరో వెబ్ సిరీస్ కు రెడీ.. స్టైలిష్ స్పై గా సామ్

భాష సమస్య కాదు- సమంత

సమంతకు స్టార్ హీరో ట్రీట్మెంట్

విజయ్ దేవరకొండ బర్త్ డే కు సమంత స్పెషల్ విషెస్
పాన్ ఇండియా “లైగర్ ” మూవీ తరువాత విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#VD 11″మూవీ పూజ కార్యక్రమంతో ప్రారంభం అయ్యింది. సమంత కథానాయిక. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ , దర్శకుడు బుచ్చిబాబు సానా స్విఛ్ ఆన్ తో ప్రారంభం అయిన “#VD 11″మూవీ రెగ్యులర్ షూటింగ్ కశ్మీర్ లో జరుగుతుంది.

హ్యాపీ బర్త్ డే - "శాకుంతలం " టీమ్
దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“శాకుంతలం ” మూవీని పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

ఎన్టీఆర్ కు జోడీ గా సామ్.. ఇదే క్లారిటీ..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా 2018 లో ‘అరవింద సమేత’ సినిమాతో బిగ్ స్క్రీన్ పై అలరించాడు ఎన్టీఆర్. ఇక దాదాపు మూడేళ్లకు పైగా ఈసినిమాతోనే బిజీగా ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు ఎంత బజ్ క్రియేట్ అయిందో చూశాం. దానికి తోడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చాలా భారీగా చేస్తున్నాడు రాజమౌళి. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఎక్కడా తగ్గకుండా చిత్రయూనిట్ మొత్తం ప్రమోషన్స్ చేస్తుంది. ఇక రాజమౌళి మ్యాజిక్ ను చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మరో వెబ్ సిరీస్ కు రెడీ.. స్టైలిష్ స్పై గా సామ్
ఏ మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత పదేళ్లలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాదు బిజినెస్ రంగంలోనూ.. హోస్ట్ గాను.. సేవా కార్యక్రమాలు ఇలా పలు విషయాల్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఇక దర్శక ద్వయం రాజ్, డీకే రూపొందించిన ‘ది ఫ్యామిలీమెన్ 2’తో ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది సమంత. ఇక ఈ సిరీస్ లో నటించిన సమంతకు ఏ రేంజ్ లో ప్రశంసలు దక్కాయో చూాశాం. అంతేకాదు మొదటి వెబ్ సిరీస్ కే అవార్డ్ ను సైతం గెలుచుకుంది.

భాష సమస్య కాదు- సమంత
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను సమంత కంప్లీట్ చేశారు.సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. "పుష్ప "మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన సమంత వరుస ప్రాజెక్ట్స్ కు…

సమంతకు స్టార్ హీరో ట్రీట్మెంట్
ఇప్పుడున్న టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే.. లక్కీ హీరోయిన్ గా... సమంత ఉంటే సినిమా హిట్టే అన్న రేంజ్ కు ఎదిగింది. దీనికి కారణం ఆమె ఎంచుకునే కథలు కూడా కారణమే అని చెప్పొచ్చు. అందుకే దాదాపు ఎక్కువ హిట్ సినిమాలనే తన ఖాతాలో వేసుకుంది. ఆశ్చర్యం ఏంటంటే.. పెళ్లి తరువాత హీరోయిన్లకు పెద్దగా సినిమాలు రావు.. సక్సెస్ రేట్ కూడా తక్కువగానే ఉంటుంది.. కానీ అమ్మడు అదృష్టం ఏంటో కానీ పెళ్లి తరువాత కూడా అవకాశాలు తగ్గలేదు కదా.. వరుస హిట్లు కొట్టేస్తుంది. అందుకే ఇప్పుడు సమంతకు స్టార్ హీరో ట్రీట్మెంట్ దక్కుతుంది.