
ట్యాగ్ · 7 కథనాలు


సౌత్ రీమేక్ తో సైఫ్ తనయుడి ఎంట్రీ..!

'ప్రభాస్' పై సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు

ప్రభాస్ పై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసలు

'ఆది పురుష్' షూటింగ్ పూర్తి చేసుకున్న సైఫ్
'ఆదిపురుష్' - లంకేశునిగా సైఫ్ అలీఖాన్
ప్రభాస్ కు విలన్ గా సైఫ్ అలీఖాన్..?

NTR 30 లో రావణుడి ఎంట్రీ
ఇండస్ట్రీలలో ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయిన సంగతి తెలిసిందే కదా. స్టార్ హీరోలు సైతం ఇప్పుడు వేరే భాషల్లో చేయడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ రేంజ్ పెరిగిపోవడంతో బాలీవుడ్ హీరోలు సైతం తెలుగు సినిమాల్లో నటించడానికి ముందుకొస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక మరో స్టార్ హీరో సినిమాలో నటించబోతున్నాడు సైఫ్ అలీఖాన్. ఆహీరో ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

సౌత్ రీమేక్ తో సైఫ్ తనయుడి ఎంట్రీ..!
సౌత్ సినిమాలకు నార్త్ లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ మలయాళం సినిమాలకు ఇంకా మంచి క్రేజ్ ఉంది. ఈమధ్యకాలంలో వస్తున్న మలయాళం సినిమాలు అన్నీ మంచి హిట్లు అందుకుంటున్నాయి. మంచి కథలు, డిఫరెంట్ జోనర్లలో వస్తున్నాయి కాబట్టి ప్రేక్షకులకు బాగా నచ్చుతున్నాయి. మన తెలుగులోనే చాలా మలయాళ సినిమాలు రీసెంట్ గా రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో తనయుడు కూడా మలయాళం రీమేక్ తోనే ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో తనయుడు మరెవరో కాదు.. సైఫ్ ఆలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం ఖాన్.

'ప్రభాస్' పై సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఆది పురుష్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. ఇక రావణాసురిడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. తాజాగా సైఫ్ తన షూటింగ్ పార్ట్ ను సైతం కంప్లీట్ చేసేశాడు.

ప్రభాస్ పై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసలు
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.“ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

'ఆది పురుష్' షూటింగ్ పూర్తి చేసుకున్న సైఫ్
ప్రభాస్ ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో రాామాయణం ఆధారంగా తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా షూటింగ్ కు కూడా చాలా సమస్యలే తలెత్తాయి. కానీ ఓం రౌత్ మాత్రం ఎక్కడా తగ్గకుండా చాలా జాగ్రత్తగా పరిస్థితులకు తగ్గట్టు షూట్ ను జరిపాడు. ముంబైలో పరిస్థితులు సహకరించని సమయంలో కూడా హైదరాబాద్ లో షూటింగ్ చేశాడు. ప్రస్తుతానికి అయితే ముంబైలోనే షూటింగ్ జరుగుతుంది. ఇక ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే కదా. ‘తానాజీ’ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి…
'ఆదిపురుష్' - లంకేశునిగా సైఫ్ అలీఖాన్
ప్రభాస్ 22 సినిమా 'ఆదిపురుష్' అప్ డేట్స్ మాత్రం వెంట వెంటనే ఇచ్చేస్తున్నారు చిత్రయూనిట్. అనవసరమైన గాసిప్స్ రావడంకంటే ముందే క్లారిటీ ఇస్తే ఓ పనైపోతుంది అనుకుంటున్నారేమో కానీ సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ.. ఏదో ఒక క్లారిటీ ఇస్తూనే వున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేసారు.
ప్రభాస్ కు విలన్ గా సైఫ్ అలీఖాన్..?
ఏదైనా కొత్త సినిమా రాబోతుందంటే రూమర్స్ రావడం సహజం. అలాటింది ప్రభాస్ సినిమా.. భారీ బడ్జెట్ సినిమా.. బాలీవుడ్ డైరెక్టర్ అంటే ఆ సినిమాపై ఎన్ని రూమర్స్ వస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది ఆదిపురుష్ సినిమాకు. ఈ సినిమాను నిన్ననే అధికారికంగా ప్రకటించారు. ఆదిపురుష్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కబోతుందని.. రామునిగా ప్రభాస్ కనిపించనున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో…