సౌత్ రీమేక్ తో సైఫ్ తనయుడి ఎంట్రీ..!

Bollywood Star Saif Son To Enter Into Movie Industry Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, saif ali khan,Bollywood Star saif ali khan,saif ali khan Son Entery in Film Industry Soon,saif ali khan Son Enter into Movie Industry Soon,saif ali khan Movie latest Updates, saif ali khan Latest News,saif ali khan Upcoming Movies,saif ali khan New Movie Updates,saif ali khan Latest News About His Son,saif ali khan Son latest Updates About His Entery in Film Industry, saif Son Ibrahim Ali Khan Entry in Movie Industry with Remake of Malayalam Movie,Ibrahim Ali Khan Entry with Remake of Malayalam Movie,Ibrahim Ali Khan Movie Entry Soon

సౌత్ సినిమాలకు నార్త్ లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ మలయాళం సినిమాలకు ఇంకా మంచి క్రేజ్ ఉంది. ఈమధ్యకాలంలో వస్తున్న మలయాళం సినిమాలు అన్నీ మంచి హిట్లు అందుకుంటున్నాయి. మంచి కథలు, డిఫరెంట్ జోనర్లలో వస్తున్నాయి కాబట్టి ప్రేక్షకులకు బాగా నచ్చుతున్నాయి. మన తెలుగులోనే చాలా మలయాళ సినిమాలు రీసెంట్ గా రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో తనయుడు కూడా మలయాళం రీమేక్ తోనే ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో తనయుడు మరెవరో కాదు.. సైఫ్ ఆలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం ఖాన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో ప్రణవ్ మోహన్‌లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా హృదయం. ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాగా, మంచి హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా హిందీ హక్కులను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ మలయాళ ప్రేమకథ హృదయం హిందీ, తమిళం, తెలుగు భాషల రైట్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈనేపథ్యంలో ఈ సినిమాతో ఇబ్రహీం ఖాన్ ను వెండితెరకు పరిచయం చేయాలని కరణ్ అనుకుంటున్నాడట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + fifteen =