ట్యాగ్ · 5 కథనాలు

గ‌్రామీణ నేపథ్యంలో ‘ప్రతి రోజూ పండగే’?

ప్రతి రోజూ పండగే మూవీ ప్రారంభం
డిఫరెంట్ రోల్‌లో సాయి తేజ్?

తేజ్-మారుతి సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
పక్కా మాస్ లుక్ లో సాయితేజ్?
`చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన `సుప్రీమ్` హీరో సాయితేజ్... ప్రస్తుతం `సోలో బ్రతుకే సో బెటర్` అనే హిలేరియస్ ఎంటర్ టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... వచ్చే ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గ‌్రామీణ నేపథ్యంలో ‘ప్రతి రోజూ పండగే’?
`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత సాయి తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా `ప్రతి రోజు పండగే`. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మూడు తరాలకు చెందిన వ్యక్తుల (తాత, తండ్రి, మనవడు) మధ్య ఉండే అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. తాత, తండ్రి పాత్రల్లో సత్యరాజ్, రావురమేష్ కనిపించనుండగా... మనవడి పాత్రలో సాయి తేజ్ దర్శనమివ్వనున్నాడు. కాగా... హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం (జూన్ 24న) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం... అతిత్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనుంది. అంతేకాదు…

ప్రతి రోజూ పండగే మూవీ ప్రారంభం
చిత్రలహరి మూవీ విజయోత్సాహం తో హీరో సాయి ధరమ్ తేజ్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గీతా ఆర్ట్స్ 2 , UV క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరో గా ప్రతి రోజూ పండగే మూవీ ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమం జరుపుకొంది. అందాల తార రాశీఖన్నా కథానాయిక కాగా తమిళ నటుడు సత్య రాజ్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ప్రతి రోజూ పండగే మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ 27వ తేదీ ప్రారంభం కానుంది.
డిఫరెంట్ రోల్‌లో సాయి తేజ్?
ఈ వేసవికి విడుదలైన ‘చిత్రలహరి’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశాడు మెగా హీరో సాయి తేజ్. కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజుకి... ఈ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ బాగా వర్కవుట్ అయిందనే చెప్పాలి. ఈ విజయం అందించిన ఉత్సాహంతో తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ మెగా హీరో. ప్రస్తుతం తేజు... యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి డైరెక్షన్‌లో ‘భోగి’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు... ఇదివరకు ఎప్పుడూ కనిపించని పాత్రలో ఇందులో దర్శనమివ్వనున్నాడట ఈ `సుప్రీమ్` స్టార్.

తేజ్-మారుతి సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
వరుస పరాజయాల తరువాత చిత్రలహరి సినిమాతో కాస్త రిలాక్స్ అయ్యాడు సాయితేజ్. ఇక ఇదే జోష్ లో మరో సినిమా చేస్తున్నాడు తేజ్. మారుతి డైరెక్షన్ లో తేజ్ కొత్త సినిమా ఉండబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ల పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.