కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ravi Babu

ట్యాగ్ · 5 కథనాలు

Changure BangaruRaja Teaser out now
ట్రైలర్ & టీజర్

ఛాంగురే బంగారురాజా టీజర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ వరుసగా ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్లను అందుకోగా రీసెంట్ గా రిలీజ్ అయిన రావణాసుర సినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా రవితేజ ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ పెట్టి దానిపై పలు సినిమాలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ బ్యానర్ నుండి పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
House Arrest Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Tollywood Updates,House Arrest Grand Release On Aug 27th,House Arrest Releasing On Aug 27th,House Arrest Release Update,House Arrest Release News,House Arrest
రిలీజ్ అప్‌డేట్

'హౌస్ అరెస్ట్' రిలీజ్ డేట్ ఫిక్స్

90 ఎమ్ఎల్ ఫేమ్ శేఖర్‌ రెడ్డి యర్నా దర్శకత్వంలో శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, రఘు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ‘హౌజ్‌ అరెస్ట్‌’. పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక ఇంట్లోకి దొంగతానికి వెళ్లిన కామెడీ గ్యాంగ్‌ ను పిల్లలు హౌజ్‌ అరెస్ట్‌ చేస్తారు. ఆతరువాత ఏం జరిగింది అన్నది కథ అని టీజర్ ను బట్టి ఇప్పటికే అర్థమైంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'దోచెయ్' సప్తగిరి కామెడీ సీన్స్

విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో టాలీవడ్ లో టాప్ కమెడియన్ గా ఎదిగిన కమెడియన్ సప్తగిరి. నిజానికి సప్తగిరి అసలు పేరు వేరు. అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. గొప్ప డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తర్వాత కమెడియన్ గా సెటిల్ అయిపోయారు. చిత్తూరు యాస లో సప్తగిరి చేసే కామెడీకి తెలుగు ప్రేక్షకులు నవ్వుకోవాల్సిందే. ప్రేమకథాచిత్రం అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో టాప్ కమెడియన్ గా ఎదిగారు. కమెడియన్‌గా టాలీవుడ్‌ను ఆకట్టుకొన్న సప్తగిరి హీరోగా మారి సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలలో కూడా నటించారు. ఇక ఇదిలా ఉండగా…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

రవిబాబు 'క్రష్' టీజర్ రిలీజ్

టాలీవుడ్ లో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్స్ లో రవి బాబు కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేయకుండా... డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. తన మొదటి సినిమా అల్లరి దగ్గర నుండి మొన్న వచ్చిన ఆవిరి సినిమా వరకూ ప్రతి సినిమాలోనూ వైవిధ్యతను చూపించడం రవిబాబు ప్రత్యేకత. తన క్రియేటివిటీనే తనను ప్రేక్షకులకు దగ్గర చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల ‘అదుగో’ అంటూ పంది పిల్లతో తీసిన ప్రయోగాత్మక చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ‘ఆవిరి’ అంటూ హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించినా అది కూడా విజయం దక్కించుకోలేక పోయింది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

రవి బాబు షూటింగ్ ఎక్స్ పీరియన్స్

ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు రవి బాబు తన స్వంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పై నూతన తారాగణం తో రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "క్రష్ " మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కు ముందు కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న "క్రష్ " మూవీ3నెలల లాక్ డౌన్ తరువాత తెలంగాణ ప్రభుత్వం అనుమతి తో షూటింగ్ ప్రారంభమయింది. లాక్ డౌన్ తరువాత షూటింగ్ జరుపుకుంటున్న మొదటి సినిమా "క్రష్ ".

Team TFNవాట్సాప్

షేర్