
ట్యాగ్ · 6 కథనాలు

రష్మిక ' రేంజ్' రోవర్
రష్మిక... ద ఫెస్టివల్ క్వీన్
ఫారెస్ట్ ఆఫీసర్ గా రష్మిక?
తక్కువ గ్యాప్‌లో సందడి చేయనున్న రష్మిక

పల్లెటూరి పడుచు పాత్రలో రష్మిక?

టీచర్ కాబోయి హీరోయిన్ - రష్మిక
తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు."సుల్తాన్ " మూవీ తో రష్మిక తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక తన రెండవ బాలీవుడ్ మూవీ “గుడ్ బై ” షూటింగ్ లో పాల్గొంటున్నారు.
రష్మిక ' రేంజ్' రోవర్
టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క అన్ని లాంగ్వేజెస్ లో కూడా హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది. బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను' సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.
రష్మిక... ద ఫెస్టివల్ క్వీన్
`ఛలో`(2018)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. రెండో చిత్రం `గీత గోవిందం`తో ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తరువాత వచ్చిన `దేవదాస్`, `డియర్ కామ్రేడ్` నిరాశపరిచినా... 2020లో వరుస విజయాలతో దూసుకుపోతోంది రష్మిక.
ఫారెస్ట్ ఆఫీసర్ గా రష్మిక?
వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతోంది కథానాయిక రష్మికా మందణ్ణ. `ఛలో` నుంచి `డియర్ కామ్రేడ్` వరకు ఒకదానితో ఒకటి పొంతన లేని భూమికల్లో దర్శనమిచ్చిన ఈ కన్నడ కస్తూరి... చిత్రీకరణ తుది దశలో ఉన్న `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాల్లోనూ ఇదివరకు నటించని పాత్రల్లో కనిపించబోతోంది.
తక్కువ గ్యాప్‌లో సందడి చేయనున్న రష్మిక
`ఛలో`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రష్మిక మందన్న. తొలి సినిమాతోనే కుర్రకారు మనసు దోచిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... మలి చిత్రం `గీత గోవిందం`తో స్టార్‌డమ్‌ని సొంతం చేసుకుంది. కాగా... ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయికగా నటిస్తోంది. అయితే... వాటిలో రెండు సినిమాలు తక్కువ గ్యాప్‌లోనే థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే `భీష్మ`, `సరిలేరు నీకెవ్వరు`.

పల్లెటూరి పడుచు పాత్రలో రష్మిక?
`ఆర్య`, `ఆర్య 2` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తోంది.