ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

నిర్మాతగా రష్మిక
`ఆచార్య`లో రష్మికా మందన్న?
`భీష్మ`తోనూ రష్మిక కొనసాగిస్తుందా?

సూర్యకి జోడీగా రష్మిక?
చిత్తూరు యాస భాష ప్రాక్టీస్ లో రష్మిక?
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో "పుష్ప " మూవీ రూపొందుతుంది. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న "పుష్ప " మూవీ 5భాషలలో రిలీజ్ కానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ చిత్తూరు యువకుడిగా నటిస్తున్నారు. చిత్తూరు యాస భాష ను నేర్చుకున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

నిర్మాతగా రష్మిక
బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం", "సరిలేరు నీకెవ్వరు" , "భీష్మ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో అగ్ర తారగా దూసుకుపోతున్నారు. రష్మిక ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కొత్త దర్శకులకు అవకాశం కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు.
`ఆచార్య`లో రష్మికా మందన్న?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య`. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 30 శాతం చిత్రీకరణ పూర్తయిందని సమాచారం.
`భీష్మ`తోనూ రష్మిక కొనసాగిస్తుందా?
సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` అంటూ సందడి చేసిన కన్నడ కస్తూరి రష్మికా మందన్న.. మహాశివరాత్రికి `భీష్మ`తో పలకరించనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ రెండు సినిమాలకూ తనే డబ్బింగ్ చెప్పుకుంది రష్మిక. `సరిలేరు నీకెవ్వరు`లో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం రష్మికకి కలసి వచ్చిన నేపథ్యంలో... `భీష్మ`కి కూడా అది కొనసాగుతుందేమో చూడాలి. రేపు (ఫిబ్రవరి 21) ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సూర్యకి జోడీగా రష్మిక?
అనతికాలంలోనే కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది చందనసీమ చిన్నది రష్మిక మందన్న. ఈ రెండు చోట్లా క్రేజీ ఆఫర్లను మూటగట్టుకుంటూనే.. మరోవైపు కోలీవుడ్ పై కూడా కన్నేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఇప్పటికే `ఖైదీ` కార్తి సరసన `సుల్తాన్` అనే చిత్రంలో నటిస్తున్న రష్మిక.. తాజాగా అతని అన్న సూర్యతోనూ కలసి నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుందని తమిళ చిత్ర వర్గాల సమాచారం.