
ట్యాగ్ · 7 కథనాలు


రానా నాయుడు 2కూడా రానుంది

ఎన్టీఆర్ నుండి అది దొంగతనం చేస్తా

రానా-వెంకీ వెబ్ సిరీస్ రానా నాయుడు టీజర్ రిలీజ్

రానా నాయుడు 3 కూడా
టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు.గత ఏడాది నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ కొన్ని విమర్శలను మూటగుట్టుకుంది కానీ వ్యూస్ పరంగా సెన్సేషన్ సృష్టించింది.ప్రస్తుతం సీజన్ 2 షూటింగ్ కొనసాగుతుంది. ఈఏడాది చివర్లో రానా నాయుడు 2 ను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చేలా నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుంది.ఇక రానా నాయుడు సీజన్ 3కూడా వుండనుందట.ఇందుకు నెట్ ఫ్లిక్స్ కూడా ఆమోదం తెలిపిందని సమాచారం.సీజన్ 2 వచ్చాక కొంచెం గ్యాప్ ఇచ్చి సీజన్ 3 ని మొదలుపెట్టనున్నారు.

రానా నాయుడు 2కూడా రానుంది
వెంకటేష్,రానా మొదటి సారి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు.హిందీ,తెలుగు భాషల్లో గత మార్చి 10నుండి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.నెట్ ఫ్లిక్స్ లో ఏకంగా మూడు వారాల పాటు ట్రెండింగ్ లో కొనసాగింది. సుపర్ణ్ వర్మ ,కరుణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో సుర్లీన్ చావ్లా,ఆదిత్య మీనన్,ప్రియా బెనర్జీ,అశీష్ విద్యార్ధి కీలకపాత్రల్లో నటించారు. మొదటి సీజన్ మొత్తం 10ఎపిసోడ్ల తో తెరకెక్కగా సంగీత్ -సిద్దార్థ్ సంగీతం అందించారు. ఇక సీజన్ 1 హిట్ కావడంతో రానా నాయుడు సీజన్ 2 రానుందని నెట్ ఫ్లిక్స్ ఆఫీషియల్ గా ప్రకటించింది. అందుకు సంబంధించి ఓ గ్లిమ్ప్స్ ను కూడా…

ఎన్టీఆర్ నుండి అది దొంగతనం చేస్తా
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ గురించి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ అలానే తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. అతని డిక్షన్ కానీ డైలాగ్ డెలివరీకి గాను సాటి లేదు. ఎంత పెద్ద డైలాగ్, అలానే ఎన్ని పేజీల డైలాగులు అయినా గుర్తుపెట్టుకొని సింగిల్ టేక్ లో చెప్పగలిగే టాలెంటెడ్ యాక్టర్ అని ఇప్పటికే ఎంతో మంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు వేరే భాషలను సైతం తొందరగా నేర్చుకునే టాలెంట్ ఉంది తారక్ కు. ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్ నుండి ఆ టాలెంట్ ను దొంగతనం చేస్తా అంటున్నారు మరో టాలెంటెడ్ హీరో రానా.

రానా నాయుడు వెబ్ సిరీస్ లో సవాల్ విసిరిన పాత్ర నాగ నాయుడు - వెంకటేష్
లోకోమోటివ్ గ్లోబల్ ఇంక్ బ్యానర్ పై కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో రానా, వెంకటేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ద్వారా మార్చి 10 వ తేదీ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో సుచిత్ర పిళ్ళై, సుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా ముఖ్య పాత్రలలో నటించారు. సంగీత్ – సిద్ధార్ధ్ సంగీతం అందించారు. ఈ వెబ్ సీరీస్ లో వెంకటేష్, తాను తండ్రీకొడుకులుగా నటించామనీ చెప్పారు. రియల్ బాబాయ్, కొడుకులు రీల్ లైఫ్ లో తండ్రీకొడుకులు గా నటించడం విశేషం.

రానా నాయుడు వెబ్ సిరీస్ లో తన రోల్ గురించి రానా మాటల్లోనే
లోకోమోటివ్ గ్లోబల్ ఇంక్ బ్యానర్ పై కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో రానా, వెంకటేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ద్వారా మార్చి 10 వ తేదీ స్ట్రీమింగ్ కానుంది.ఈ వెబ్ సిరీస్ లో సుచిత్ర పిళ్ళై , సుర్వీన్ చావ్లా , గౌరవ్ చోప్రా ముఖ్య పాత్రలలో నటించారు. సంగీత్ - సిద్ధార్ధ్ సంగీతం అందించారు.

రానా నాయుడు- నెట్ ఫ్లిక్స్ కు వెంకీ ఫన్నీ వార్నింగ్
ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా ఎంత నడుస్తుందో చూస్తున్నాం. అందుకే స్టార్ సెలబ్రిటీలు సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నారు. వారు ఎవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్ ఇంకా రానా. వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ అగ్రహీరో గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు రానా.. టాలెంటెడ్ హీరో. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. చిత్రీకరణ కూడా పూర్తిచేసుకుంది. ఇప్పటికే ఈసిరీస్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.

రానా-వెంకీ వెబ్ సిరీస్ రానా నాయుడు టీజర్ రిలీజ్
ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తుంది. ఒకప్పటిలా కాకుండా స్టార్ హీరోలు సైతం ఇతర స్టార్ హీరోలతో కలిసి నటించడానికి ఏమాత్రం సందేహించడం లేదు. ఇక ఇప్పటికే పలు సినిమాలు సందడి చేసేశాయి. ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నారు. వారు ఎవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్ ఇంకా రానా. వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ అగ్రహీరో గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు రానా.. టాలెంటెడ్ హీరో. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ పై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.