ట్యాగ్ · 5 కథనాలు
"RED " మూవీ దీపావళికి థియేటర్స్ లో రిలీజ్ ?
'రెడ్' సినిమా - డబ్బింగ్ పూర్తి చేసిన రామ్
రామ్-సంతోష్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి..?
ఫ్యాన్స్ కు ఇదే నా విజ్ఞప్తి..!
రామ్ మిర్రర్ సెల్ఫీ
బ్లాక్ బస్టర్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయమయిన రామ్ పోతినేని ఆ మూవీ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "రెడీ ", "కందిరీగ ", "పండగ చేస్కో ", "నేను శైలజ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో మాస్ క్యారెక్టర్ లో రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా జీ సినీ అవార్డ్ అందుకున్నారు.
"RED " మూవీ దీపావళికి థియేటర్స్ లో రిలీజ్ ?
శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర లలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. సూపర్ హిట్ "తడమ్ "తమిళ మూవీ కి తెలుగు రీమేక్ గా "RED " మూవీ రూపొందింది.
'రెడ్' సినిమా - డబ్బింగ్ పూర్తి చేసిన రామ్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నుఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. రామ్ తన డబ్బింగ్ పూర్తి చేసినట్టు తన ఇన్స్టా ద్వారా తెలిపాడు.
రామ్-సంతోష్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి..?
పలు సినిమాలకు కెమెరా మెన్ గా పనిచేసి 'కందిరీగ' సినిమాతో డైరెక్టర్ గా మారాడు సంతోష్ శ్రీనివాస్. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తీసిన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీనే ఈ సినిమాకు ప్రధాన బలం. దానికి తగ్గట్టే ఈ సినిమాలో రామ్ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో హైపర్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. ఇక ఇప్పుడు ముచ్చట మూడోసారి కాంబినేషన్ రిపీట్ చేయనున్నట్టు తెలుస్తుంది.
ఫ్యాన్స్ కు ఇదే నా విజ్ఞప్తి..!
కరోనాతో దేశం పెద్ద యుద్ధమే చేస్తుంది. అందరూ ఇళ్లల్లోనే ఉంటూ పోరాడుతున్నారు. ఇక ఈ కరోనా వల్ల పెళ్లిళ్లు పలు వేడుకలకు కూడా దూరమయ్యారు ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు, సన్నిహితులు, స్నేహితులను ఇబ్బంది పెట్టకూడదని ఎనర్జిట్ స్టార్ రామ్ పోతినేని నిర్ణయం తీసుకొన్నారు. మే 15న రామ్ పుట్టినరోజు. అయితే ఈ సందర్భంగా రామ్ పోతినేని తన అభిమానులు ఎవరు తన బర్త్ డే వేడుకలు చేయోద్దంటూ రిక్వెస్ట్ చేసాడు. ప్రస్తుతం మన దేశం కరోనా అనే మహామ్మారితో పోరాడుతోంది. ఈ సమయంలో అందరు ఇంట్లోనే ఉంటూ కరోనానను తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చాడు.