
ట్యాగ్ · 9 కథనాలు


లోకేష్ తో రజనీ చివరి సినిమా?

లాల్ సలామ్ రజనీ ఫస్ట లుక్ రిలీజ్

జైలర్ - డిఫరెంట్ షేడ్స్ లో రజినీ?

'పెద్దన్న' ట్రైలర్ రిలీజ్

'పెద్దన్న' టీజర్ రిలీజ్

తనయ సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్

పోల్ గేమ్ : తలైవా బెస్ట్ తెలుగు డబ్బింగ్ మూవీ ?

కమల్ బ్యానర్ లో రజినీ కాంత్ సినిమా
తమిళ అగ్ర నటులు రజినీకాంత్, కమల్ హాసన్ దాదాపు ఐదు దశాబ్దాల స్నేహానికి గుర్తుగా ఒక మెగా ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై, రజినీకాంత్ కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. రజినీకాంత్ కు ఇది 173 వ సినిమా. ఈ తలైవర్ 173 చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుందర్ సి డైరెక్ట్ చేయనున్నాడు.

లోకేష్ తో రజనీ చివరి సినిమా?
సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఈ వయసులో యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే రజనీకాంత్ జైలర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకా 170వ చిత్రం, TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఇంకా కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో వస్తున్న లాల్ సలామ్‌లో పవర్ ప్యాక్డ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. అయితే రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తున్నా కానీ తన చివరి సినిమా ఇదే అంటూ గత కొద్ది కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

లాల్ సలామ్ రజనీ ఫస్ట లుక్ రిలీజ్
సూపర్ట్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేసేస్తున్నాడు. ప్రస్తుతం రజనీ జైలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమాను ఆగష్ట్ 10 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

జైలర్ - డిఫరెంట్ షేడ్స్ లో రజినీ?
తలైవా రజినీకాంత్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం అయితే తాను జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో రజినీకాంత్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో పాటు మరో రెండు, మూడు షెడ్స్ లో కనిపించనున్నాడని…

'పెద్దన్న' ట్రైలర్ రిలీజ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్నాత్తే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమేషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను చూస్తుంటే రజినీ అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నట్టు తెలుస్తుంది. యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్ స్టైల్, డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచేసింది.

'పెద్దన్న' టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా అన్నాత్తే. ఈ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా తెలుగులో ఈసినిమాను పెద్దన్న అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి తాజాగా తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు…

రజనీకాంత్ "పెద్దన్న "మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తలైవా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “అన్నాత్తే ” తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ "పెద్దన్న"మూవీ నవంబర్ 4వ తేదీ దీపావళి పండగకు రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో నయనతార కధానాయిక కాగా కీర్తిసురేశ్ , మీనా, ఖుష్బూ సుందర్ కీలకపాత్రలలో నటించారు. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు.

తనయ సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో యాక్షన్ ఎంటర్ టైనర్ “అన్నాత్తే ”తమిళ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రజనీకాంత్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ఈ మూవీ లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ , హీరో రజనీకాంత్ కాంబినేషన్ లో రూపొందుతున్న “అన్నాత్తే ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పోల్ గేమ్ : తలైవా బెస్ట్ తెలుగు డబ్బింగ్ మూవీ ?
భాషా : సత్య మూవీస్ బ్యానర్ పై సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్ , నగ్మా జంటగా రూపొందిన గ్యాంగ్ స్టర్ తమిళ మూవీ "భాషా "తెలుగు డబ్బింగ్ వెర్షన్ "భాషా "ఘనవిజయం సాధించింది. హీరో రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో అద్భుతంగాపెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ లోని భాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే డైలాగ్ పాప్యులర్ అయ్యింది.