
ట్యాగ్ · 45 కథనాలు · పేజీ 3

రాఘవ లారెన్స్ న్యూ మూవీ టైటిల్
స్టార్ హీరోలను మించి రాఘవ లారెన్స్ విరాళం..!

రాఘవ లారెన్స్ "దుర్గ"ఫస్ట్ లుక్ రిలీజ్
డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , యాక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ రాఘవ లారెన్స్ కోలీవుడ్ , టాలీవుడ్ లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. హారర్ కామెడీ జోనర్ చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న లారెన్స్ ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్నారు. లారెన్స్ ప్రస్తుతం "రుద్రన్ ", "ఆధికారమ్ "తమిళ మూవీస్ లో హీరోగానటిస్తున్నారు . తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
రాఘవ లారెన్స్ న్యూ మూవీ టైటిల్
డ్యాన్సర్ గా పలు తమిళ , తెలుగు మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రాఘవ లారెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ మూవీస్ కు పనిచేసిన లారెన్స్ "అన్నయ్య ", "ఇంద్ర ", "స్టైల్ " వంటి మూవీస్ కు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. "అర్పుతం "తమిళ మూవీ తో లారెన్స్ హీరోగా మారారు. సూపర్ హిట్ "ముని "మూవీ తో లారెన్స్ హీరోగా సెటిల్ అయ్యారు.
'చంద్రముఖి 2' లీడ్ యాక్ట్రెస్ పై లారెన్స్ క్లారిటీ..!
పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ విషయాన్ని స్యయంగా దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ ఇటీవలే ప్రకటించాడు కూడా. ఇక అప్పటినుండి చంద్రముఖి 2 పై రూమర్లు వస్తూనే ఉన్నాయి.
స్టార్ హీరోలను మించి రాఘవ లారెన్స్ విరాళం..!
కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల వల్ల పేదలు కాస్త సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక వారికి సాయం చేయడం కోసం ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకొచ్చారు. పేదలకు.. రోజూ కూలి పనులు చేసుకునే వారికి ఎవరికి తోచినంత వారు సాయం చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కొరియో గ్రాఫర్, నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ కూడా విరాళం అందించారు. సినిమా రంగంలోనే కాదు ప్రజాసేవలో కూడా ఎప్పుడూ ముందే ఉంటాడు ఈయన. తన సంపాదనలో చాలా వరకు ఓ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అందులో వికలాంగులకు సహాయం చేస్తుంటాడు. కరోనా బాధితులకు తన వంతు సాయంగా 3 కోట్ల విరాళం అందించాడు లారెన్స్.
రజినీకాంత్ ని డైరెక్ట్ చేయనున్న రాఘవ లారెన్స్?
వరుస చిత్రాలతో సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు మీదున్నారు. గత ఏడాది సంక్రాంతికి `పేట`తోనూ.. ఈ సంవత్సరం సంక్రాంతికి `దర్బార్`తోనూ పలకరించిన రజినీ.. ఈ దసరాకి `అణ్ణాత్త` (తెలుగు టైటిల్ నిర్ణయించాల్సి ఉంది)తో సందడి చేయనున్నారు. ఆపై తన మిత్రుడు, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో తన 169వ సినిమా చేయనున్నారు.