ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2

`మిర్చి` తరువాత శైలి మార్చిన ప్రభాస్

జాన్ బడ్జెట్ కూడా భారీగానే..!

పునర్జన్మల నేపథ్యంలో ప్రభాస్ చిత్రం?
`ప్రభాస్ 20` నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్...
ప్రభాస్‌తో మరోసారి జట్టుకట్టనున్న ‘దిల్’ రాజు?
బ్యాక్ టూ షూట్..!

ప్రభాస్ కి టచ్ లో పూరీ..!
`బాహుబలి - ది కంక్లూజన్` తేదికి `ప్రభాస్ 20`?
పాన్ - ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం 2021 వేసవిలో రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల కానున్న ఈ అఖిల భారత చిత్రం (పాన్ - ఇండియా ఫిల్మ్)కి రిలీజ్ డేట్ లాక్ అయిందని టాక్. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన `బాహుబలి - ది కంక్లూజన్`(2017) విడుదలైన ఏప్రిల్ 28న `ప్రభాస్ 20` థియేటర్లలో సందడి చేయనుందని తెలిసింది. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

`మిర్చి` తరువాత శైలి మార్చిన ప్రభాస్
`ఈశ్వర్`(2002)తో కథానాయకుడిగా తొలి అడుగేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆపై చిత్రచిత్ర ప్రవర్ధమానంగా ఎదిగి.. `బాహుబలి` సిరీస్ తో నేషనల్ స్టార్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో పలకరిస్తూ వచ్చిన ప్రభాస్.. ఈ మధ్య కాస్త శైలి మార్చి రెండేళ్ళకో సినిమాతో సందడి చేస్తున్నాడు.

జాన్ బడ్జెట్ కూడా భారీగానే..!
సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు 'జాన్' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది.అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు జాన్ షూటింగ్ లో బిజీ అయ్యాడు.

పునర్జన్మల నేపథ్యంలో ప్రభాస్ చిత్రం?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ పిరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి `జిల్` రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ... ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
`ప్రభాస్ 20` నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్...
`వర్షం`, `డార్లింగ్`... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌లోని ప్రేమికుడి కోణాన్ని ఆవిష్కరించిన చిత్రాలివి. ఆ తరువాత ప్రేమకథలకు దూరమైన ఈ లవబుల్ స్టార్... సుదీర్ఘ విరామం అనంతరం మరో ప్రణయగాథతో పలకరించబోతున్నాడు. అది కూడా ఓ పిరియాడికల్ లవ్ స్టోరీతో. 1970 నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఇటలీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా... `జిల్` రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ప్రభాస్‌తో మరోసారి జట్టుకట్టనున్న ‘దిల్’ రాజు?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కలిసొచ్చిన నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. గతంలో ఈ ఇద్దరి కలయికలో ‘మున్నా(2007), ‘మిస్టర్ పర్ ఫెక్ట్’(2011) వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. కాగా... త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని సమాచారం.
బ్యాక్ టూ షూట్..!
బాహుబలి సిరీస్ కు దాదాపు 5ఏళ్ళు తీసుకొని సాహూ కి ఏకంగా 2ఏళ్ళు తీసుకొని ఇప్పుడు రాధా కృష్ణ తో మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన సాహో సినిమా తర్వాత ప్రభాస్ హాలిడే ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ట్రిప్ నుండి తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా.. ప్రభాస్ తిరిగి రావడంతో మళ్ళీ మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్.

ప్రభాస్ కి టచ్ లో పూరీ..!
చాలా ప్లాప్స్ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసీ ఇస్మార్ట్ గా హిట్ కొట్టాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా తరువాత ఫామ్ లోకి వచ్చి వెంటనే ప్రస్తుతం ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరో అయిన విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది.