
ట్యాగ్ · 5 కథనాలు

'స్పిరిట్' లో పోలీస్ గా ప్రభాస్.. 'ఆదిపురుష్' విజువల్ ట్రీట్
బాహుబలి ఫ్రాంచైజ్ తరువాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో తెలిసిందే కదా. ఆ తరువాత వచ్చిన సాహో సినిమా ఇక్కడ అంత ఫలితాన్ని ఇవ్వలేకపోయినా నార్త్ ఆడియన్స్ కు మాత్రం చాలా బాగా నచ్చేసింది. అందుకే హిందీలో ఈసినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇక సాహో తరువాత ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. రాధేశ్యామ్ రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. ఆదిపురష్, సలార్, ప్రాజెక్ట్ కే, ఇంకా పట్టాలెక్కని స్పిరిట్ ఇలా అన్నీ పాన్ ఇండియా ఇంకా భారీ బడ్జెట్ సినిమాలే.

'స్పిరిట్'.. ప్రభాస్ హీరోయిన్ వార్తల్లో నిజం లేదు..!
ప్రభాస్ సిల్వర్ జూబ్లీ సినిమా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రభాస్ సరసన కొరియన్ భామ హీరోయిన్ గా నటిస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. కొరియన్ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యో ఈసినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది అని వార్తలు ఊపందుకున్నాయి. ప్రభాస్ సినిమా కాబట్టి ఆవార్తలు మరింత వైరల్ అయ్యాయి.

బాలీవుడ్ లో ప్రభాస్ దూకుడు
బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ స్టైలిష్ ఎంటర్ టైనర్ “సాహో” మూవీ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్ “మూవీ 2002 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది.హీరో ప్రభాస్ ప్రస్తుతం “సలార్”, “ఆది పురుష్“మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ”…

ప్రభాస్ "స్పిరిట్ " 8 భాషలలో రిలీజ్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణ లో యువి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజేహెగ్దే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”, తెలుగు , హిందీ భాషలలో 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆది పురుష్“ , పాన్ వరల్డ్ మూవీ "ప్రాజెక్టు K " మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి. హీరో ప్రభాస్ సిల్వర్ జూబ్లీ మూవీ అనౌన్స్ మెంట్ నిన్న జరిగిన విషయం తెలిసిందే.

అఫీషియల్.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో 'ప్రభాస్ 25'
ఒకప్పుడు అంటే హీరోలు ఏడాదికే వరసుపెట్టి నాలుగైదు సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు కాబట్టి చేసే సినిమాల సంఖ్య కూడా తగ్గిపోయింది. అందుకే సిల్వర్ జూబ్లీ సినిమా అంటే 25వ సినిమానే ఎంతో ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభాస్ సిల్వర్ జూబ్లీ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రభాస్ 25వ సినిమా గురించి అప్ డేట్ వస్తుందని ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పటి నుండి ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆ అప్ డేట్ ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా తాజాగా ప్రభాస్ 25వ సినిమా అప్ డేట్ వచ్చేసింది.