
ట్యాగ్ · 6 కథనాలు


ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ

ప్రధాని మోదీకి వరలక్ష్మీ పెళ్లి ఆహ్వానం

పవన్ అంటే తుఫాన్-మోడీ ప్రశంసలు

ప్రధాని మోదీ కై కాంతార మూవీ స్పెషల్ స్క్రీనింగ్

టాలీవుడ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు

ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు తాజాగా ఆయన ప్రధానితో పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్' అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం.

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అక్కినేని కుటుంబం కలిసింది. ఈ మేరకు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సహా ఆయన కుటుంబసభ్యులు మరియు ఇతర అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శుక్రవారం పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రిని కలుసుకున్నారు. కాగా లెజెండరీ నటుడు, అక్కినేని నాగేశ్వరరావు సినీ చరిత్ర, మరియు ఆయన సాధించిన విజయాలకు నివాళిగా పద్మభూషణ్ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ 'అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ' అనే పుస్తకాన్ని రచించారు.

ప్రధాని మోదీకి వరలక్ష్మీ పెళ్లి ఆహ్వానం
తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. గోపీచంద్ మలినేని క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆ తరువాత వరుసగా సినిమాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోయింది. హనుమాన్ తో ఈ ఏడాది వరలక్ష్మి మరో సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం అయితే పలు సినిమాలు తన లిస్ట్ లో ఉన్నాయి.

పవన్ అంటే తుఫాన్-మోడీ ప్రశంసలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఏపీలో కూటని ఘన విజయం సాధించడంలో పవన్ పాత్ర కీలకం అని ఇప్పటికే అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దానికి తోడు పొత్తులో భాగంగా పవన్ తీసుకుంది 21 సీట్లే అయినా కూడా వందకి వంద శాతం స్ట్రైక్ రేట్ ను సాధించి 21 సీట్లలో విజయం సాధించి ఆ దిశగా మరో రికార్డును క్రియేట్ చేశాడు. ఇక కూటమి పాత్ర కూడా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుండటం కూడా కలిసొచ్చిన విషయం.

ప్రధాని మోదీ కై కాంతార మూవీ స్పెషల్ స్క్రీనింగ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 188 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ ఇతర భాషలన్నింటిలోనూ 60 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

టాలీవుడ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు
చిన జీయర్ స్వామి పర్య వేక్షణలో హైదరాబాద్ ముచ్చింతల్ లో సమతామూర్తి శ్రీ రామాన్యుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ముచ్చింతల్ దివ్యక్షేత్రం లో ప్రపంచంలోనే అతి పెద్దదైన శ్రీ రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. ఆ దివ్య క్షేత్రం లో యాగ శాలలు దర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.