
ట్యాగ్ · 7 కథనాలు


ఛత్రపతి హిందీ ట్రైలర్ రిలీజ్

ఛత్రపతి హిందీ టీజర్ రిలీజ్

రూమర్లకు చెక్.. థియేటర్ లోనే 'ఆర్ఆర్ఆర్'

ఛత్రపతి హిందీ రీమేక్ గ్రాండ్ లాంచ్

ఛత్రపతి ట్రైలర్ కు షాకింగ్ రెస్పాన్స్
టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ ఛత్రపతిని ఇప్పుడు హిందీలోకి తీసుకెళ్తున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.ఇందులో ప్రభాస్ నటించిన పాత్రలో సాయి శ్రీనివాస్ నటిస్తుండగా వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు.మేకింగ్ లో పెద్దగా మార్పులు ఏమి చేయడం లేదు కానీ ఒరిజినల్ వెర్షన్ కంటే ఈరీమేక్ లో ఎక్కువ యాక్షన్ సీన్స్ ను ఆడ్ చేస్తున్నారని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది.ఇక నిన్న ఈట్రైలర్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

ఛత్రపతి హిందీ ట్రైలర్ రిలీజ్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి. ఈసినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో ఈ రీమేక్ రాబోతుంది. ఇక ఈసినిమాతోనే బెల్లంకొండ శ్రీనివాస్కూడా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఈసినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ రిలీజ్ కు మాత్రం చాలా ఆలస్యమైంది. ఫైనల్లీ మే 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా టీజర్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ అయి సినిమాపై…

ఛత్రపతి హిందీ టీజర్ రిలీజ్
తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సినిమా, ఛత్రపతి ఇప్పుడూ హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈరీమేక్ లో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. హిందీలో శ్రీనివాస్ కు ఇదే మొదటి సినిమా. ఒరిజినల్ వెర్షన్ టైటిల్ తోనే తెరకెక్కుతున్న ఈచిత్రానికి వివి వినాయక్ దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 61 నిమిషాల నిడివి తో వచ్చిన ఈ టీజర్ ను యాక్షన్ సీన్స్ తో నింపేశారు. ఒరిజినల్ వెర్షన్ ను అలాగే హిందీలో తీస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

500 కోట్లతో వి వి వినాయక్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ?
సూపర్ హిట్ ఆది మూవీ తో దర్శకుడు గా టాలీవుడ్ కు పరిచయం అయిన వివి వినాయక్ ఆ మూవీ తో బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. ఆది మూవీ 96 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకొనడం విశేషం. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి , దిల్ , ఠాగూర్ , సాంబ , బన్నీ , లక్ష్మి , కృష్ణ , అదుర్స్ , నాయక్ , ఖైదీ నెం 150 మూవీస్ ఘనవిజయం సాధించాయి. వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సూపర్ హిట్ ఛత్రపతి మూవీ హిందీ రీమేక్ ఛత్రపతి మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తో దర్శకుడిగా వినాయక్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

రూమర్లకు చెక్.. థియేటర్ లోనే 'ఆర్ఆర్ఆర్'
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజీనెస్ ఏ రేంజ్లో జరిగిందో తెలుసు కదా. ఈసినిమా షూటింగ్ దశలో ఉండగానే డిజిటల్, శాటిలైట్స్ రైట్స్ ను పెద్ద మొత్తంలో చెల్లించి మరీ దక్కించుకున్నారు.

ఛత్రపతి హిందీ రీమేక్ గ్రాండ్ లాంచ్
బెల్లంకొండ సురేష్ వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ కు మొదటినుండి సినిమా అవకాశాలకు మాత్రం కొదువ లేదు. టాప్ ప్రొడ్యూసర్ కాబట్టి ఇప్పటివరకూ పెద్ద డైరెక్టర్స్, భారీ బడ్జెట్ సినిమాలే తీశాడు. అయితే చివరిగా వచ్చిన తమిళ్ రీమేక్ రాక్షసుడు తప్పా సూపర్ హిట్ అందించిన సినిమాలు పెద్దగా ఏం లేవు. ఇక ఇప్పుడు ఈహీరో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. అది కూడా ఇక్కడ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఛత్రపతి సినిమాతో. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈసినిమా కరోనా వల్ల ఆగిపోయింది.

అఫీషియల్.. 'ఆర్ఆర్ఆర్' డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ డీటైల్స్
ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంత బడ్జెట్ ఎందుకు సినిమా పోతే పరిస్థితి ఏంటి అనుకోడానికి అక్కడ ఉంది రాజమౌళి... స్టార్ హీరోలు ఎన్టీఆర్-రామ్ చరణ్. కాస్త లేట్ అయినా జక్కన్న మంచి అవుట్ పుట్ వచ్చాకే సినిమాను వదులుతాడు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి కొత్తగా చెప్పేదేముంది. సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే ఈసినిమా హక్కులు ఏ రేంజ్ లో అమ్ముడుపోయాయో చూశాం. దానికి కారణం బాహుబలి కూాడా అనుకోండి. ఈసినిమా ఎన్ని కోట్లు కలెక్షన్స్ రాబట్టిందో తెలుసు కదా. ఆ సినిమా ప్రభావం కూడా ఆర్ఆర్ఆర్ పై పడింది. హాట్ కేకుల్లా హక్కులను సొంతం చేసుకోడానికి పోటీ పడ్డారు. ఇక ఈసినిమా…