
ట్యాగ్ · 5 కథనాలు

థమన్ 'బుధవారం' ట్వీట్ 'వకీల్ సాబ్' గురించా..?
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో..?

#PSPK28.. ఆ సైలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి పవన్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ మాత్రం ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. కారణం ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్. ఆ సినిమా అయిపోయిన తర్వాత క్రిష్ తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ సినిమా మొదలుకానుంది.
#PSPK28 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
ఫైనల్లీ పవన్ నాలుగో అప్ డేట్ కూడా వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి కూడా సర్ ప్రయిజ్ ఉన్నట్టు నిన్ననే తెలిపారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో స్టైలిష్ బైక్ కనిపిస్తుండగా..దానిపై పెద్ద బాలశిక్ష పుస్తకం..బ్యాక్ డ్రాప్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ చిత్రాలు కనిపిస్తూ దేశభక్తిని స్మృశించేలా ఉంది. హరీష్ శంకర్ కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేస్తుంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్…
థమన్ 'బుధవారం' ట్వీట్ 'వకీల్ సాబ్' గురించా..?
రీసెంట్ గానే చిరు పుట్టిన రోజు అయిపోయింది. ఇక చిరు పుట్టిన రోజున కామన్ మోషన్ పోస్టర్, కామన్ డీపీ అంటూ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ బాగానే హడావుడి చేశారు. ఇక ఫ్యాన్స్ కోసం ఆచార్య నుండి ఒక అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కోసం. మరి ఎంత సెలెబ్రేట్ చేయొద్దని చెప్పినా ఫ్యాన్స్ కదా ఏదో ఒక రకంగా తమ హీరోపై అభిమానంతో ఏదో ఒకటి చేస్తారు. అంతేకాదు తన సినిమా నుండి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని అదే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో..?
రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో అభిమానులు పవన్ సినిమా ఎప్పుడొస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా కొద్దిరోజుల్లో వకీల్ సాబ్ సినిమా రాబోతుంది అనుకుంటుండగా ఈలోపు కరోనా రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. ఇంకా కొద్దిపాటి షూటింగ్ మాత్రమే ఉంది. ఇక ఆ పార్ట్ కూడా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న విరూపాక్ష సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్... 1998 నాటి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?
వేసవికి విడుదల కాబోతున్న `వకీల్ సాబ్`తో రీ-ఎంట్రీ బాట పట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఇదే ఏడాది మరో సినిమాతో పలకరించబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సదరు పిరియాడిక్ ఫిల్మ్ దీపావళి కానుకగా సందడి చేయనుందని సమాచారం. సో... 2020లో పవన్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడన్నమాట.