
ట్యాగ్ · 6 కథనాలు


పూణే లో పవన్ OG కొత్త షెడ్యూల్
ఓజి షూటింగ్ అప్డేట్

'సత్యాగ్రహి' అందుకే చేయలేదు..!

'వకీల్ సాబ్'- 9 పేజీల డైలాగ్..సింగిల్ టేక్

5 ప్రాజెక్ట్స్ తో బిజీగా పవన్..!

పవన్ కళ్యాణ్‌ని కలిసిన ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాల ప్రొడ్యూసర్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే.

పూణే లో పవన్ OG కొత్త షెడ్యూల్
పవర్ స్టార్ మాత్రం ప్రస్తుతం బ్రేక్స్ లేకుండా సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పవన్ చేతిలో పలు ప్రాజెక్ట్ ఉండగా అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే టైటిల్ తో వస్తుంది. టైటిల్ కు తగ్గట్టే ఈసినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రీసెంట్ గానే అక్కడ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అప్పుడే మరో షెడ్యూల్ ను ప్రారంభించేశారు. పూణేలో ఓజీ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు…
ఓజి షూటింగ్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మొదటి షెడ్యూల్ ఈరోజుతో ముగిసింది. గత నెలలో ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభం కాగా ఈరోజు తో తొలి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు.ఈసందర్భంగా పవన్ స్టిల్ ను రిలీజ్ చేశారు.ఈస్టిల్ లో పవన్ లుక్ అదిరిపోయింది. ఈ స్టిల్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఇక మొదటి షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరక్కించారు.తదుపరి షెడ్యూల్ మహాబలేశ్వర్ లో జరుగనుంది.ఈషెడ్యూల్ లో పవన్ అలాగే హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ లపై పాటను చిత్రీకరించనున్నారు.

'సత్యాగ్రహి' అందుకే చేయలేదు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. మధ్యలో సినిమాలు చేయనని చెప్పినా తరువాత మాత్రం సినిమాలు కూడా స్టార్ట్ చేసి ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగించారు. ఇక ఇదిలా ఉండగా నేడు స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ జయంతి. ఇక ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. జనసేన పార్టీపై జయ ప్రకాశ్ నారాయణ్ లోక్ నాయక్ ఇన్ఫ్లూయన్స్ చాలా ఉంది.. మీ రచనలు, మీ ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకంగా ఉంటుంది.. ఇక ఈరోజు జయ ప్రకాశ్ నారయణ్ జయంతి నేపథ్యంలో జనసేన పార్టీ గ్రేట్ లీడర్ కు సెల్యూట్ చేస్తుంది. అంతేకాకుండా లోక్ నాయక్…

'వకీల్ సాబ్'- 9 పేజీల డైలాగ్..సింగిల్ టేక్
మూడేళ్ల తరువాత వకీల్ సాబ్ తో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతేకాదు ఈసినిమాలో ముఖ్యంగా కోర్టు సీన్స్ కు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. ప్రకాష్ రాజ్ అలాగే పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కానీ.. అలాగే వాదోపవాాదాలు కానీ ఇద్దరూ పోటీ పడిమరీ నటించారు అన్నారు.

5 ప్రాజెక్ట్స్ తో బిజీగా పవన్..!
ఒక్కోసారి రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో కొట్టే డైలాగ్ ఇది. కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా? చేయడా? అంటూ మాట్లాడుకోవడంలోనే రెండేళ్లు గడిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ కి క్లారిటీ ఇచ్చి సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఒక సినిమా మాత్రమే చేసే అవకాశం ఉందని అంతా అనుకుంటున్న సమయంలో ఆయన ఒక్కసారిగా మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి షాకిచ్చాడు. మరి పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే ఫ్యాన్స్ కు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీ ఎంట్రీ అందులో…