
ట్యాగ్ · 6 కథనాలు


బ్రో సెట్ లో సాయి ధరమ్ తేజ్- షూట్ కిక్ స్టార్

పవన్-తేజ్ మూవీ అద్భుతంగా వస్తుంది

PKSDT మూవీ కి జూలై సెంటిమెంట్

పవన్-సాయి తేజ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రారంభం అయిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ

బ్రో ప్రమోషనల్ సాంగ్ మ్యాజికల్ గా ఉంటుంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనేే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈసినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేస్తుంది. పవన్ ఫస్ట్ పోస్టర్ నుండే సినిమాకు హైప్ రాగా అక్కడ నుండి ఈసినిమా నుండి రిలీజ్ చేసిన ప్రతి పోస్టర్ అలానే టీజర్ అంచనాలను భారీగా పెంచేశాయి.

బ్రో సెట్ లో సాయి ధరమ్ తేజ్- షూట్ కిక్ స్టార్
సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరోో సాయి థరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనే సినిమాకు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పవన్ తన టాకీ పార్ట్ ను పూర్తిచేశాడు.

పవన్-తేజ్ మూవీ అద్భుతంగా వస్తుంది
మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రావడంతో అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి సాయి తేజ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందుకున్నాడు. ఇక ఈసినిమా మంచి సక్సెస్ అవ్వడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు సాయి తేజ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేశారు. ఇక దీనికి గాను సాయి తేజ్ తన సోషల్ మీడియా ద్వారా కతజ్ఞతలు చెప్తూ.. తమ బ్యానర్ నుండి వస్తున్న వినోదయ సితం రీమేక్ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

PKSDT మూవీ కి జూలై సెంటిమెంట్
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై సముద్ర ఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుప్రీం హీరో సాయితేజ హీరోలుగా తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వినోదయ సితం మూవీ తెలుగు రీమేక్ జూలై 28 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో కేతిక శర్మ , రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు , స్క్రీన్ ప్లే అందించడం విశేషం .

పవన్-సాయి తేజ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న క్రేజీ కాంబినేషన్స్ లో పవన్ కళ్యాణ్ -సాయి దరమ్ తేజ్ ది కూడా ఒకటి. ఫైనల్ గా ఈ కాంబినేషన్ నుండి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో పవన్-సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళ్ సముద్రఖని ఈసినిమాలో నటించి, దర్శకత్వంలో వహించాడు. ఇప్పుడు తెలుగు రీమేక్ కు కూడా ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈమధ్యనే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు షూటింగ్ కూడా మొదలుపెట్టారు. పవన్ కూడా కొంత వరకూ తన పోర్షన్స్ ను కంప్లీట్ చేశాడు.

ప్రారంభం అయిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.