కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

NTR

ట్యాగ్ · 126 కథనాలు · పేజీ 7

షూటింగ్ అప్‌డేట్

మిడ్ నైట్ చలిలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ షూటింగ్

కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి చాలా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టగా టీం మాత్రం నిర్విరామంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఒక్కసారి కమిట్ అయితే ఎంత కష్టమైనా షూటింగ్ కు మాత్రం బ్రేక్ చెప్పడు. ఇక ఇప్పటికే షూటింగ్ కు సంబంధించి పలు వీడియోలు పోస్ట్ చేయగా ఇప్పుడు మరో వీడియో ను ఆర్ఆర్ఆర్ టీం పోస్ట్ చేసింది. ఇక వీడియోలో చూస్తుంటే చ‌లికి వ‌ణుకుతూ షూటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్ కు మాటిచ్చిన ఎన్టీఆర్

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. హీరోలంటే అభిమానులకు ఎంత ప్రేమ ఉంటుందో.. తమ అభిమానులపై కూడా అదే ప్రేమను... అదే అభిమానాన్ని చూపిస్తారు మన హీరోలు. ఇక అనారోగ్యంతో ఉన్న తమ అభిమానులను స్వయంగా కలిసిన హీరోలు కూడా చాలా మంది వున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్, రామ్ చరణ్ ఇలా పలువురు హీరోలు తమ అభిమానుల లాస్ట్ విష్ ను తీర్చినవాళ్ళే. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఒక ఫ్యాన్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పడంతోపాటు మాటిచ్చాడు కూడా.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'రామరాజు ఫర్ భీమ్' - వాడి పొగ‌రు ఎగిరే జెండా

మొత్తానికి ఎన్టీఆర్ అన్నదే జరిగింది. `రామరాజు ఫర్ భీమ్` వీడియోను ఈ రోజు 11 గంటలకు విడుదల చేస్తున్నామని చెప్పడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ టైం వస్తుందా అని ఎదురుచూసారు. అయితే 11.30 కు టీజర్ ను రిలీజ్ చేస్తున్నామని రాజమౌళి ట్వీట్ చేసి ఎన్టీఆర్ అన్నట్టుగానే లేట్ చేశారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఆర్ఆర్ఆర్' - భీం టీజర్ కు ముహూర్తం ఫిక్స్

కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో తన సత్తా చాటిన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఆ మాత్రం క్యూరియాసిటీ ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇక ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ కు దూరంగా ఉన్న టీమ్ రీసెంట్ గానే షూట్ ను స్టార్ట్ చేసింది. అంతేకాదు స్టార్ట్ చేస్తూ ఎన్టీఆర్ టీజర్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక అప్పటినుండి ఆ తరుణం కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'RRR' - భీమ్ స‌ర్‌ప్రైజ్ కు ముహూర్తం ఫిక్స్

మొత్తానికి ఏ సినిమా అప్ డేట్ కోసం.. ఏ సినిమా షూటింగ్ కోసం ఇన్ని రోజులు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటో ఐడియా వచ్చింది కదా. ఇంకేంటి దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా. ఈ సినిమా అప్ డేట్ ఇస్తామని మేకర్స్ నిన్న చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. కరోనా వల్ల మార్చి నుండి షూటింగ్ ను జరపలేదని.. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశామని తెలిపారు. అంతేకాదు ఆ వీడియోలో గేట్స్ తెర‌వ‌డం, దుమ్ము ప‌ట్టిన వ‌స్తువుల‌ను దుల‌ప‌డం, లొకేష‌న్ ప‌రిస‌రాల‌ని శుభ్ర‌ప‌ర‌చ‌డంకు సంబంధించిన…

TFN Adminవాట్సాప్
NTR Mythological Masterpiece Srikrishnanjaneya Yuddham Completes 48 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood Updates,NTR,Sr NTR,Sr NTR Movies,Sr NTR Srikrishnanjaneya Yuddham,Sr NTR Sr
సినిమా వార్తలు

యన్టీఆర్ ‘శ్రీకృష్ణాంజ‌నేయ యుధ్ధం’కు 48 ఏళ్ళు

నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావుకు బాగా కలిసొచ్చిన దిగ్గజ దర్శకుల్లో సి.యస్.రావు ఒకరు. వీరిద్దరి కలయికలో పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు తెరకెక్కగా వాటిలో సింహభాగం విజయం సాధించాయి. అలాంటి అలనాటి అపురూప చిత్రాల్లో ‘శ్రీకృష్ణాంజ‌నేయ యుధ్ధం’ ఒకటి. “అహంకారంతో బలరాముడు, అజ్ఞానంతో సత్యభామ, పదవీవ్యామోహంతో గరుత్మంతుడు పెంచుకున్న దర్పాన్ని అణచి, ఆంజనేయుని భక్తికి గల శక్తిని నిరూపించిన” సినిమా ఇది. ఇందులో యన్టీఆర్ శ్రీ‌కృష్ణుడిగా న‌టించ‌గా, రాజ‌నాల ఆంజ‌నేయుడిగా దర్శ‌న‌మిచ్చారు. య‌న్టీఆర్ సరసన దేవిక, వాణిశ్రీ కథానాయికలుగా నటించారు. యస్.వి.రంగారావు, కాంతారావు, రాజనాల, ఆర్జా జనార్ధన్‌రావు…

Team TFNవాట్సాప్

షేర్