కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nivetha Thomas New Updates

ట్యాగ్ · 5 కథనాలు

సినిమా వార్తలు

ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేశా

సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఒక ప్లేస్ ను సొంతం చేసుకోవడం కష్టం. ఒకసారి మంచి నటిగా పేరు వచ్చిన తర్వాత అవకాశాలు అవే వచ్చేస్తాయి. ఇక టాప్ పొజిషన్ కు చేరుకున్న తర్వాత స్టార్ హీరోలు సరసన నటించాలని అనుకుంటారు. ఇంకా దిగ్గజాలు క‌మ‌ల్, ర‌జినీతో క‌ల‌సి న‌టించ‌డం అంటే అంత కంటే అదృష్టం లేదు అని భావిస్తారు. కానీ అలాంటి అరుదైన అవ‌కాశాల‌ను అందుకున్న వారిలో యువ క‌థానాయిక నివేదా థామ‌స్ కు చాలా తొందరగానే వచ్చిందని చెప్పొచ్చు. ఐదేళ్ళ గ్యాప్ లో ఈ ఇద్ద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది నివేదా. యాదృచ్చికం ఏంటంటే రెండు సినిమాల్లోనూ కూతురిగా న‌టించే అవ‌కాశం ద‌క్క‌డం గ‌మ‌నార్హం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"V" మూవీ ప్రమోషన్స్ లో నివేద థామస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. అమిత్ త్రివేది సాంగ్స్ స్వరపరచగా థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చాలా విషయాల్లో నాని నాకు ఇన్స్పిరేషన్

వైవిధ్యమైన సినిమాల్లో... విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేద థామస్. ఒక్కో మెట్టు ఎదుగుతూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం నివేదా నటించిన 'వి' సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. నాని, సుధీర్ బాబు, ఆదితిరావు హైద‌రిల‌తో క‌లిసి నివేదా ఈ సినిమాలో నటించింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా నానితో తనకున్న అనుబంధం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రతి ఆర్టిస్ట్ కు ఆ కోరిక ఉంటుంది

కథల ఎంపికలో చాలా సెలెక్టివ్ గా వుంటూ.. విభిన్నమైన పాత్రల్లో నటించే నటులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వాళ్లల్లో నివేదా థామస్ కూడా ఒకటని చెప్పొచ్చు. మొదటి నుండి స్క్రిప్ట్స్ విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటుంది నివేదా. అందుకే తను నటించే సినిమాలు మాగ్జిమం సక్సెస్ ను సొంతం చేసుకుంటాయి. ఇక ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నివేదా థామస్‌ ఈ సినిమా గురించి పలు విషయాలు పంచుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నివేద థామస్ మనసులో మాట

"వెరుతే ఒరు భార్య " మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు బాలనటి గా పరిచయం అయిన నివేద థామస్ , ఆ మూవీ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ స్టేట్ అవార్డ్ ను అందుకున్నారు . సక్సెస్ ఫుల్ "ప్రయాణం "మూవీ లో నటించిన నివేద "పోరాలి " మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించారు. సూపర్ హిట్ "జెంటిల్ మన్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "నిన్నుకోరి", "జై లవకుశ ", "118 ", "బ్రోచేవారెవరురా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో నివేద ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్

షేర్