
ట్యాగ్ · 5 కథనాలు

జెట్ స్పీడ్ లో నితిన్

2020 సంవత్సరంలో నితిన్ త్రిబుల్ ట్రీట్

ఆగస్ట్ లో హీరో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “మాస్ట్రో ” మూవీ మేజర్ షూటింగ్ షెడ్యూల్ గోవా లో జరుగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “మాస్ట్రో ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉందనీ , 7 రోజుల షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉందనీ చెప్పారు.
జెట్ స్పీడ్ లో నితిన్
సూపర్ హిట్ "భీష్మ "తరువాత యంగ్ హీరో నితిన్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ మార్చి నెల 6 వ తేదీ రిలీజ్ కానుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "చెక్ "మూవీ ఒక సాంగ్ మినహా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని సమాచారం. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ , ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు.
`ఛల్ మోహన్ రంగ` దర్శకుడితో నితిన్ `పవర్ పేట`?
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. `భీష్మ`, `రంగ్ దే`, `చదరంగం` (చంద్రశేఖర్ యేలేటి ఫిల్మ్) పేర్లతో రూపొందుతున్న సదరు మూడు సినిమాలు చిత్రీకరణ తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో... `ఛల్ మోహన్ రంగ` దర్శకుడు కృష్ణ చైతన్యతో కొత్త చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు నితిన్.
భాగ్యనగరంలో నితిన్ - చంద్రశేఖర్ యేలేటి చిత్రం
యువ కథానాయకుడు నితిన్, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నితిన్ చెస్ ప్లేయర్ కనిపించనుండగా... రకుల్ క్రిమినల్ లాయర్ గానూ, ప్రియా ప్రకాష్ హనీ ట్రాపర్ గానూ దర్శనమివ్వబోతున్నారని సమాచారం.

2020 సంవత్సరంలో నితిన్ త్రిబుల్ ట్రీట్
యంగ్ హీరో నితిన్ 4 మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. 2020 సంవత్సరంలో నితిన్ హీరోగా నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. కొత్త సంవత్సరం కానుకగా తన అభిమానులకు హీరో నితిన్ త్రిబుల్ ట్రీట్ ఇస్తున్నారు. నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం 2018 సంవత్సరం ఆగస్ట్ లో రిలీజయింది. ఆ మూవీ తరువాత నితిన్ నటించిన ఏ మూవీ రిలీజ్ కాలేదు.