ట్యాగ్ · 6 కథనాలు
పెళ్ళికి ముందే సినిమా పూర్తి..!
తమిళ్ సినిమా రూమర్స్ పై నిహారిక క్లారిటీ..!
‘ఆచార్య’లో సిస్టర్ సెంటిమెంట్?

నేనేం సమంత ను కాదు.. అప్పుడే చెప్పడానికి..!
చిరు సినిమాలో మరోమారు నిహారిక?
నిహారిక ఎంగేజ్ మెంట్ డేట్ అప్పుడే..?
మెగా కాంపౌండ్ లో కూడా త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నిహారికకు కాబోయే వరుడిని అందరికీ పరిచయం చేశారు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టుగా తెలుస్తోంది. గుంటూరుకు చెందిన ఓ పోలీస్ అధికారి కొడుకు చైతన్య. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి నిశ్చితార్దానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆగస్ట్ 13న చైతన్య, నిహారిక ల నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆగస్టులో ఎంగెజ్మెంట్, వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
పెళ్ళికి ముందే సినిమా పూర్తి..!
మొత్తానికి నిహారిక కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. నిన్ననే తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేసింది. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిహారిక చేసుకోబోయే చైతన్య అయితే ఒక్కరోజులో ఫేమస్ అయిపోయాడు. అంతేకాదు హీరోకి కాబోయే అన్ని లక్షణాలు ఉన్నాయంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు అందరూ.
తమిళ్ సినిమా రూమర్స్ పై నిహారిక క్లారిటీ..!
మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా నిహారిక కు మాత్రం హీరోయిన్ గా ఇంకా నిలదొక్కునే ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పటికీ మంచి సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిననిహారిక ఆసినిమాలో తన నటనతో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, ప్రణీత్ దర్శకత్వంలో సూర్యకాంతం, తమిళ్ లో ఒక సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా నిహారికకు విజయం అందించలేకపోయాయి. అయితే సూర్యకాంతం సినిమాలో నిహారిక నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకూ మరే సినిమా చేయలేదు. అయితే గత ఏడాది సైరా చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది.
‘ఆచార్య’లో సిస్టర్ సెంటిమెంట్?
‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి ఘనవిజయాల తరువాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150’ తరువాత చిరుకి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా.. మెగా ప్రిన్సెస్ నిహారికా కొణిదెల అతిథి పాత్రలో దర్శనమివ్వనుందని సమాచారం.

నేనేం సమంత ను కాదు.. అప్పుడే చెప్పడానికి..!
కరోనా వల్ల అందరూ ఇంట్లోనే ఉండటంతో సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ అయిపోయారు. లైవ్ ల ద్వారా అభిమానులతో కాసేపు ముచ్చటిస్తున్నారు. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్నారు. ఇక నిహారికా కూడా సోషల్ మీడియాలో కాసేపు మాట్లాడి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఇక వచ్చి ప్రతీ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ సినిమాలు చేస్తా అని చెప్పింది. అంతే కాదు పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా... నేనేమన్న సమంతనా పెళ్లి తరువాత కూడా నటిస్తానని ఇప్పుడే చెప్పడానికి అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక నిహారిక కొద్దిగా టైమ్ ఉందని అనడంతో త్వరలోనే నిహారిగా పెళ్లి చేసుకోబోతుందని వార్తలు అందుకున్నాయి.
చిరు సినిమాలో మరోమారు నిహారిక?
మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం `సైరా నరసింహారెడ్డి`లో గిరిజన యువతిగా కనిపించింది మెగా డాటర్ నిహారిక. కట్ చేస్తే.. ఇప్పుడు చిరుతో మరోమారు స్క్రీన్ షేర్ చేసుకోనుందని టాక్.