ట్యాగ్ · 6 కథనాలు
నిధి అగర్వాల్ పర్సనల్ స్పేస్ గ్లింప్స్
కరోనా ను నయం చేస్తా - నిధి అగర్వాల్
రవితేజ కు జోడీగా నిధి అగర్వాల్
పవన్ సరసన నిధి అగర్వాల్?
నిధి డ్యాన్స్ రిహార్సల్స్
తెలుగు , కన్నడ , తమిళ భాషలలో ప్రావీణ్యం ఉన్న బిజినెస్ మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ అందాల నిధి అగర్వాల్ బాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లలో ట్రైనింగ్ పొందారు. బాలీవుడ్ మూవీ "మున్నా మైఖేల్ "తో కెరీర్ ప్రారంభించారు. "సవ్యసాచి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిధి బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "తో గుర్తింపు పొందారు. ఒక తెలుగు మూవీ లో కథానాయికగా నటిస్తున్న నిధి , జయం రవి "భూమి ", శింబు "ఈశ్వరన్ "తమిళ మూవీస్ లో కథానాయికగా నటించారు.
నిధి అగర్వాల్ పర్సనల్ స్పేస్ గ్లింప్స్
యాక్షన్ థ్రిల్లర్ "సవ్యసాచి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిధి అగర్వాల్ ఆ తరువాత రొమాంటిక్ కామెడీ డ్రామా "Mr. మజ్ను "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో గుర్తింపు పొందారు. నిధి ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. "భూమి " మూవీ తో కోలీవుడ్, "జేమ్స్ "మూవీ తో శాండల్ వుడ్ కు నిధి పరిచయం అవుతున్నారు.
కరోనా ను నయం చేస్తా - నిధి అగర్వాల్
"సవ్యసాచి " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్" మూవీ తో విజయం సాధించారు. కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఇస్మార్ట్ గర్ల్ నిధి తన అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు స్పాంటేనియస్ గా జవాబులు చెబుతూ అభిమానులను ఫిదా చేశారు.
`అల్లుడు అదుర్స్`లో నిధి అగర్వాల్ ప్రత్యేక గీతం?
గత ఏడాది `రాక్షసుడు`తో పలకరించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్... ఈ వేసవిలో `అల్లుడు అదుర్స్` అంటూ సందడి చేయనున్నాడు. `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో సాయిశ్రీనివాస్ కి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్నారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
రవితేజ కు జోడీగా నిధి అగర్వాల్
హీరో రవితేజ ప్రస్తుతం "క్రాక్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తరువాత మరో మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సత్యనారాయణ కోనేరు నిర్మాణ సారథ్యం లో సక్సెస్ ఫుల్ "రాక్షసుడు" మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీలో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా ఇస్మార్ట్ గర్ల్ నిధి అగర్వాల్ ఎంపిక అయ్యారు.
పవన్ సరసన నిధి అగర్వాల్?
`సవ్యసాచి` (2017)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నిధి అగర్వాల్. ఆపై `మిస్టర్ మజ్ను`తో సందడి చేసినప్పటికీ.. గత ఏడాది జూలైలో రిలీజైన `ఇస్మార్ట్ శంకర్`తోనే బ్రేక్ అందుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి.. ఓ బంపర్ ఆఫర్ దక్కిందని టాలీవుడ్ టాక్.