ట్యాగ్ · 6 కథనాలు

ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు మీరు

బర్త్ డే కి సర్ ప్రయిజ్ ఇవ్వనున్న బాలయ్య..!

బాబోయ్ మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో చేయను...!

`రామారావు`కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్?

మలయాళ రీమేక్ లో బాలకృష్ణ?
వచ్చే ఏడాదే అంటున్న బాలకృష్ణ..!
లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నుండి ఈ సినిమా షూటింగ్స్ కు అనుమతులు వచ్చినా ఇప్పుడప్పుడే షూటింగ్ లకు వెళ్లే ఆలోచనలో మాత్రం ఎవరికీ లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే.. లాక్ డౌన్ లో సడలింపులు చేయడం.. రోజు రోజుకు కేసులు కూడా పెరగడమే దీనికి కారణం. మరోవైపు షూటింగ్స్ చేయాలంటే పలు నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మాత్రం షూటింగ్లను మొదలుపెట్టాలని చూస్తున్నారు... కొంతమంది మాత్రం లేట్ అయినా పర్లేదు అని వెనక్కి తగ్గుతున్నారు.

ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు మీరు
నందమూరి బాలకృష్ణ ఈ రోజు 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్, వెంకీ ఇలా పలువురు ఇప్పటికే తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా బాలకృష్ణకు తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు, నేను ఎప్పుడూ అభిమానించే హీరో బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తమ ట్వీట్ లో పేర్కొన్నారు.

బర్త్ డే కి సర్ ప్రయిజ్ ఇవ్వనున్న బాలయ్య..!
తన పుట్టిన రోజుకు తన అభిమానులకు పెద్ద సర్ప్రైజే ప్లాన్ చేసాడు బాలకృష్ణ. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటనుకుంటున్నారా..? ఒక పాటను రిలీజ్ చేయనున్నాడు. బాలకృష్ణ కొత్త సినిమాలో పాట అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అసలు సంగతేంటంటే.. ఎన్టీఆర్ జగదేకవీరుని కథ సినిమాలోని ''శివ శంకరి శివానందలహరి.. శివశంకరి'' పాట గుర్తుండే ఉంటది కదా. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు కంపోజ్ చేసిన ఈ పాటను లెజెండ్ ఘంటసాల పాడగా పింగళి నాగేంద్ర రావ్ రాసారు. ఇక ఈ పాటను ఇప్పటి సింగర్స్ పాడాలన్న చాలా కష్టం. ఆ పాట అలా ఉంటుంది మరి. అయితే ఇప్పుడు ఈ పాటను బాలయ్య పాడటానికి రెడీ అయ్యాడు. మ్యూజిషియన్ యాజమాన్య మ్యూజిక్…

బాబోయ్ మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో చేయను...!
మళ్లీ ఎన్టీఆర్ పాత్రను చేయనని నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. అసలు సంగతేంటంటే...ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్టీఆర్ కథానాయకుడు', ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో తన తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలకృష్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ.. సినిమా మాత్రం అనుకున్నంత విజయం దక్కించుకోలేకపోయింది అని చెప్పొచ్చు. దీనితో బాలకృష్ణ కాస్త నిరాశపడ్డారట. అందుకే మరోసారి ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి నో చెప్పారట.

`రామారావు`కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్?
`పటాస్` నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు వరుసగా ఐదు విజయాలు నమోదు చేసి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. కాగా, ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత అనిల్ చేయబోయే సినిమా ఏంటో ఇంకా క్లారిటీ రాలేదు. `ఎఫ్ 2` సీక్వెల్ చేయబోతున్నాడంటూ ఒకవైపు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ పక్కా అంటూ మరోవైపు కథనాలు వస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే... నటసింహ బాలకృష్ణతో అనిల్ నెక్స్ట్ వెంచర్ ఉంటుందని టాక్.

మలయాళ రీమేక్ లో బాలకృష్ణ?
నటసింహ నందమూరి బాలకృష్ణ పలు రీమేక్ చిత్రాల్లో నటించడమే కాకుండా... ఘనవిజయాలను సైతం అందుకున్నారు. తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలచిన `మంగమ్మ గారి మనవడు` రీమేక్ మూవీనే. అలాగే `ముద్దుల మావయ్య`, `లక్ష్మీ నరసింహ`... ఇలా పలు సక్సెస్ ఫుల్ రీమేక్స్ లోనూ నటించిన వైనం బాలయ్య సొంతం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం, ఆపై బి.గోపాల్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్న నటసింహ... త్వరలో ఓ రీమేక్ ఫిల్మ్ లో నటించే అవకాశముందట. అది కూడా.. ఓ మల్టీస్టారర్ సబ్జెక్ట్ కోసం.