
ట్యాగ్ · 5 కథనాలు


#NS20 ఫస్ట్ లుక్ రిలీజ్
నాగశౌర్యకు జోడీగా "రొమాంటిక్ "భామ
నాగశౌర్య ఫిట్ నెస్ గోల్స్ - అలసిపోతే ఆగను..!
బిజీ యంగ్ హీరో నాగశౌర్య

ఆనందంలో నాగశౌర్య
యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలు విద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "NS20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్న ఈ మూవీ లో "రొమాంటిక్ " మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రూపొందుతున్న "NS20 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. అద్భుతంగా ఉన్న నాగశౌర్య లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

#NS20 ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "రొమాంటిక్ "మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక. నాగశౌర్య ఈ మూవీ లో ప్రొఫెషనల్ ఆర్చర్ గా నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
నాగశౌర్యకు జోడీగా "రొమాంటిక్ "భామ
మోడల్ . సింగర్ , యాక్ట్రెస్, యూట్యూబర్ కేతిక శర్మ డబ్ మాష్ వీడియో క్లిప్పింగ్స్ లో ఇంటర్ నెట్ లో పాప్యులర్ అయ్యారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న కేతిక ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా లోని ఇతర ఎకౌంట్స్ లో కేతిక కు అధిక ఫాలోయింగ్ ఉంది. ఆకాష్ పూరి హీరోగా రూపొందిన "రొమాంటిక్ " మూవీ తో కేతిక టాలీవుడ్ లో ప్రవేశించారు. కేతిక ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నాగశౌర్య ఫిట్ నెస్ గోల్స్ - అలసిపోతే ఆగను..!
లాక్ డౌన్ సమయంలో షూటింగులన్నీ బంద్ అయ్యాయి. మళ్లీ సినిమాలు, షూటింగ్ ల హడావిడి ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. ఇక దొరికిన ఈ ఖాళీ సమయాన్ని యంగ్ హీరోలు తమ ఫిట్ నెస్ కోసం బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే నిఖిల్, సందీప్ కిషన్ 6 ప్యాక్ లు చేసి తమ బాడీ ట్రాన్స్ఫమేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక మరో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఈ సమయాన్ని బాగానే ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు నాగ శౌర్య లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తను వర్క్ అవుట్ చేసిన వీడియో ఒకటి తన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ వర్కౌట్ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు వీడియోతో పాటు అలసిపోతే ఆపను, అనుకున్నది…
బిజీ యంగ్ హీరో నాగశౌర్య
"ఊహలు గుస గుసలాడే , "జో అచ్యుతానంద ", "ఛలో ", "కణం ", "ఓ బేబీ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. హీరో నాగశౌర్య తో జంటగా నటించి టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా , రష్మిక లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణించడం విశేషం. నాగశౌర్య స్వంత ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్ పై "ఛలో ", "నర్తనశాల ", "అశ్వథ్థామ" మూవీస్ నిర్మించారు. "అశ్వథ్థామ"మూవీ లో మాస్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగశౌర్య ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.