
ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2


ప్రభాస్ కోసం సిద్ధమైన అమితాబ్

మనకు మనమే లాక్‌డౌన్ విధించుకుందాం

టాలీవుడ్ సోల్ ఫుల్ డైరెక్టర్ 'నాగ్ అశ్విన్'

ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ
ప్రభాస్ కోసం కొత్త ప్రపంచం

హైదరాబాద్ లో "బిగ్ బీ"
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపికా పడుకొనే జంటగా భారీ బడ్జెట్ తో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో ఈ మూవీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభం కానుంది. హీరో ప్రభాస్ , అమితాబ్ ఈ మూవీ ముహూర్తానికి అటెండ్ అవుతున్నారు.

ప్రభాస్ కోసం సిద్ధమైన అమితాబ్
వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈసినిమాను కూడా ఎప్పుడో ప్రకటించిన ఇప్పటివరకూ సైట్స్ పైకి వెళ్లలేదు. మధ్యలో వచ్చిన ఆది పురుష్, సలార్ సినిమాలు మాత్రం షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న రెండు సినిమాలు పెద్ద సినిమాలే కావడంతో నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదని ఫిక్స్అయిపోయారు అందరూ.

మనకు మనమే లాక్‌డౌన్ విధించుకుందాం
ఇప్పుడున్న పరిస్థుతుల్లో ఇంట్లోనే ఉంటూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే తప్పా పరిస్థితిని అదుపుచేయలేని పరిస్థితి వచ్చింది. ఒకపక్క కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రభావాన్ని చూపుతుంది.. మరోవైపు చాలా మంది మరణిస్తున్నారు.. దీనికితోడు హాస్పిటల్స్ లో బెడ్లు సర్దుబాటు కావట్లేదు.. ఇంకోవైపు డాక్సర్స్ కు రెస్ట్ ఉండటంలేదు. మొత్తానికి పరిస్థితి మాత్రం చాలా దారుణంగానే ఉంది. ఇక ప్రస్తుతం నైట్ టైమ్ కర్ఫ్యూ విధించగా.. మళ్లీ లాక్ డౌన్ విధించనున్నారు. ఈసందర్భంగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా లాక్ డౌన్ పై స్పందించి మనకు మనమే లాక్ డౌన్ విధించుకోవాలని కోరాడు.

టాలీవుడ్ సోల్ ఫుల్ డైరెక్టర్ 'నాగ్ అశ్విన్'
ఇండస్ట్రీ అన్నతరువాత ఎంతోమంది కొత్త కొత్త డైరెక్టర్లు పుట్టుకొస్తూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ మార్కును చూపించగలుగుతారు. అలాంటి వారిలో ఈతరం దర్శకుల్లో నాగ్ అశ్విన్ పేరు కూడా ఉంటుంది. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ అల్లుడిగా ప్రియాంక దత్ భర్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చేసింది తక్కువ సినిమాలే కానీ తన ఇంపాక్ట్ మాత్రం బాగానే చూపించాడు. డైరెక్టర్ గా ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలు చేయగా.. నిర్మాతగా జాతి రత్నాలు తీశాడు. కానీ వేటికవే చాలా విభిన్నవైనవిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ
బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమే. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో " మూవీతో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం. ప్రభాస్ హీరోగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ " మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం "ఆదిపురుష్ ", "సలార్ " మూవీస్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ప్రభాస్ కోసం కొత్త ప్రపంచం
అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇక ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ్ అశ్విన్ తను చేయబోతున్న ప్రభాస్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.