
ట్యాగ్ · 5 కథనాలు


మురారి రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

మురారి రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అప్ డేట్

మహేష్ బాబు ‘మురారి’కి 19 ఏళ్ళు

మురారి రీ రిలీజ్.. థియేటర్ల వద్ద మహేష్ ఫ్యాన్స్ కోలాహలం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ‘మురారి’ చిత్రం మళ్ళీ విడుదలైంది. 4k టెక్నాలజీతో సరికొత్త హంగులతో ముస్తాబై నేడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా గ్రాండ్ రీ రిలీజ్ అయింది.

మురారి సెట్స్‌లో మహేష్ బాబు ఎంత అల్లరి చేసేవారంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆగస్టు 9న 'మురారి' రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే దీనికి ఒక్కరోజు ముందు 'ఒక్కడు' సినిమా కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో విడుదలకానుంది. ఇక రీ రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ సూపర్ స్టార్ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. తమ అభిమాన హీరో చిత్రాలు రెండు ఒక్కరోజు వ్యవధిలో థియేటర్లలోకి వస్తుండటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

మురారి రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. సెలబ్రిటీల పుట్టిన రోజుల సందర్భాలు, ప్రత్యేక అకేషన్స్ అప్పుడు సినిమాలను రీ రిలీజ్ లు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ సినిమా మరేదో కాదు మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 2001లో విడుదలైన ఈసినిమా మహేష్ సినీ కెరీర్ నే ఒక మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. కథ, కథాంశం, మహేష్ నటన, పాటలు అన్నీ సినిమా విజయంలో భాగమయ్యాయి.

మురారి రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అప్ డేట్
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మేకర్స్ వాటిని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇక రీ-రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు 'మురారి' త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.

మహేష్ బాబు ‘మురారి’కి 19 ఏళ్ళు
“ప్రేమ, సంకల్ప బలం ఉంటే... ఎన్ని తరాల శాపాన్నైనా జయించొచ్చు” అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మురారి’. సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఆధ్యాత్మిక, కుటుంబ కథా చిత్రంలో సోనాలి బింద్రే కథానాయికగా నటించింది. లక్ష్మి, సుకుమారి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, ప్రసాద్ బాబు, సుధ, ధూళిపాళ, రవిబాబు తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించగా... ప్రకాష్ రాజ్, నాగబాబు, అచ్యుత్, యం.యస్.నారాయణ అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు.