“ప్రేమ, సంకల్ప బలం ఉంటే… ఎన్ని తరాల శాపాన్నైనా జయించొచ్చు” అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మురారి’. సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన ఈ ఆధ్యాత్మిక, కుటుంబ కథా చిత్రంలో సోనాలి బింద్రే కథానాయికగా నటించింది. లక్ష్మి, సుకుమారి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, ప్రసాద్ బాబు, సుధ, ధూళిపాళ, రవిబాబు తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించగా… ప్రకాష్ రాజ్, నాగబాబు, అచ్యుత్, యం.యస్.నారాయణ అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Murari & Vasundhara❤️
Forever favourite on-screen couple😍 @urstrulyMahesh @iamsonalibendre
What’s your fav #MurariVasuMoment?#19YearsOfClassicMurari #19YearsOfMurari #Murari #MaheshBabu pic.twitter.com/7J5ghpErHC— Telugu FilmNagar (@telugufilmnagar) February 17, 2020
[custom_ad]
వేటూరి సుందరరామమూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ గీత రచనకి… “మెలోడి బ్రహ్మ” మణిశర్మ ఆకట్టుకునే బాణీలు అందించారు. “ఎక్కడ ఎక్కడ ఉందో తారక”, “అలనాటి బాలచంద్రుడు”, “బంగారు కళ్ళ”, “చెప్పమ్మ చెప్పమ్మ”, “అందానికే”, “భామ భామ”, “డుమ్ డుమ్ డుమ్ నటరాజు” గీతాలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. ఎన్.రామలింగేశ్వర రావు సారథ్యంలో రాంప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం దేవీప్రసాద్ నిర్మించిన ఈ ఎంటర్టైనర్… ద్వితీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయనటి (లక్ష్మి), స్పెషల్ జ్యూరీ అవార్డు (మహేష్ బాబు) విభాగాల్లో నంది పురస్కారాలను కైవసం చేసుకుంది. 2001 ఫిబ్రవరి 17న విడుదలై అఖండ విజయం సాధించిన ‘మురారి’… నేటితో 19 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: