
ట్యాగ్ · 5 కథనాలు


'సన్ ఆఫ్ ఇండియా' ట్రైలర్ రిలీజ్

మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సన్ ఆఫ్ ఇండియా'..!
'కలెక్షన్ కింగ్' మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు చేశారు. కేవలం హీరోగా మాత్రమే కాదు.. విలన్ గా పలు పాత్రలు చేశారు. అంతేకాదు నిర్మాతగా పలు సినిమాలు కూడా నిర్మించారు. ఇక గతకొంతకాలంగా హీరోగా సినిమాలు చేయకపోయినా.. పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఆయన ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తుంది. మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నాడు.

మొదటి సారి ఒకే స్క్రీన్ పై మోహన్ బాబు, మంచు లక్ష్మీ..!
మంచు మోహన్ బాబు వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆతరువాత కూతురు మంచు లక్ష్మీ కూడా బుల్లి తెర ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుంది. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్ట్ లతో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే మోహన్ బాబు తో మంచు విష్ణు, మంచు మనోజ్ ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్నారు కానీ మంచు లక్ష్మీ మాత్రం ఇప్పటివరకూ చేయలేకపోయింది. కానీ మొదటిసారి ఇప్పుడు తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి స్క్రీన్ ను షేరు చేసుకోబోతున్నారు.

'సన్ ఆఫ్ ఇండియా' ట్రైలర్ రిలీజ్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా సినిమాలు చేసి చాలా కాలమైంది. అయితే పలు సినిమాల్లో కొన్ని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియాఅనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' రిలీజ్ డేట్ ఫిక్స్
మళ్లీ ఇండస్ట్రీలో సందడి మొదలైంది. ఒకరి తరువాత ఒకరు వరుసపెట్టి సినిమా రిలీజ్ డేట్లను ప్రకటించేస్తున్నారు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ఎలాగూ ఫిక్స్ అయిపోవడంతో చిన్న సినిమాలు.. మినిమం బడ్జెట్ సినిమాలు కూడా చాలా జాగ్రత్తగా సినిమా రిలీజ్ డేట్లను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ కూడా రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ సినిమా గ్లింప్స్ ని కూడా గతంలో రిలీజ్ చేశారు.
'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి నిర్మించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గత కొద్దికాలంగా చాలా తక్కువ సినిమాల్లో కినిపించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ' ఆకాశం నీ హద్దురా..!' సినిమాలో భక్త వత్సల నాయుడు అనే కీలక పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు దేశభక్తి నేపథ్యంలో వస్తున్న 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమాతో పూర్తి స్థాయి పాత్రతో వస్తున్నాడు. రత్నబాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో పడింది.