ట్యాగ్ · 5 కథనాలు
హీరోగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు

మహేష్ బాబు పర్సనల్ జిమ్
చిరు దీపపు వెలుగులో మహేష్ బాబు
లైన్ ప్రొడ్యూసర్ గోపీకృష్ణ కు మహేష్ బాబు అభినందనలు
టాలీవుడ్ లైన్ ప్రొడ్యూసర్ , ఫారిన్ షూట్ కో- ఆర్డినేటర్ గోపీకృష్ణ నర్రావుల కు సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందనలు తెలిపారు. "బజార్ రౌడీ "(1988 ) మూవీ తో లైన్ ప్రొడ్యూసర్ గా మారిన గోపికృష్ణ మహేష్ బాబు నటించిన అనేక సూపర్ హిట్ మూవీస్ కు పని చేశారు . చిరంజీవి (సైరా నరసింహా రెడ్డి ), పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది ), ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో ), ప్రభాస్ (మిర్చి ) మూవీస్ కు వర్క్ చేశారు.
అభిమానులకు మహేష్ విజ్ఞప్తి - అన్నిటికంటే అదే ముఖ్యం..!
కరోనా వల్ల టాలీవుడ్ హీరోలు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది హీరోలు తమ పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దని కోరగా ఇప్పుడు తాజాగా మహేష్ కూడా తన అభిమానులను అదే కోరుతున్నారు. ఈనెల 9వ తారీఖు మహేష్ పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. ఇక తమ అభిమాన హీరో పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ కు పండగతో సమానం కదా.. ఈ నేపథ్యంలో ఇప్పటినుండే పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తన పుట్టినరోజులు వేడుకలు జరపొద్దని అభిమానులను కోరుతున్నాడు మహేష్. ఈ సందర్భంగా తన ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేసాడు.
హీరోగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "రాజకుమారుడు "మూవీ 1999 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రీతి జింటా కథానాయిక. మణిశర్మ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మహేష్ బాబు పర్సనల్ జిమ్
"భరత్ అనే నేను", "మహర్షి ", "సరిలేరు నీకెవ్వరు " వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని తన ఇంటిలో మహేష్ బాబు పర్సనల్ జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ తన జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తారు.
చిరు దీపపు వెలుగులో మహేష్ బాబు
వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా క్రైసిస్ చారిటీ కి తన వంతు సాయం అందించిన మహేష్ బాబు ప్రధాని మోదీ పిలుపుకు స్పందించారు.