ట్యాగ్ · 7 కథనాలు
మహేష్ బాబు ట్విట్టర్ రికార్డ్
ఈవారం 'ఎమోషనల్ ఇంటలిజెన్స్' కే.. !
హీరో కృష్ణ కు మహేష్ బాబు ఫాదర్స్ డే శుభాకాంక్షలు

OFFICIAL..పరుశురాంతోనే మహేష్ సినిమా

మహేష్ బాబు పర్సనల్ జిమ్
అభిమానులకు మహేష్ బాబు థ్యాంక్స్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి మహేష్ బాబు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం ప్రారంభంలోనే "సరిలేరు నీకెవ్వరు " వంటి బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్స్ తో మహేష్ బాబు రికార్డ్స్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు మహేష్ బాబు , అభిమానులకు అనేక జాగ్రత్తలు చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
మహేష్ బాబు ట్విట్టర్ రికార్డ్
సూపర్ హిట్ "రాజకుమారుడు " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మహేష్ బాబు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. బెస్ట్ యాక్టర్ గా మహేష్ బాబు 8 నంది , 5 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న మహేష్ బాబు కు మహిళాభిమానులు కూడా ఎక్కువే. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత బ్లాక్ బస్టర్ "గీత గోవిందం" మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో రూపొందే "సర్కారు వారి పాట " మూవీ షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొంటారు.
ఈవారం 'ఎమోషనల్ ఇంటలిజెన్స్' కే.. !
కరోనా వల్ల ఒక రకంగా హీరో హీరోయిన్స్ కు షూటింగ్స్ లో పాల్గొనే పని లేకుండా పోయిందేమో కానీ.. మరోరకంగా మాత్రం లాక్‌డౌన్ సమయాన్ని సెలబ్రిటీలు బాగా వాడుకుంటున్నారు. నచ్చిన పనులు చేయడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, కొత్త ఇష్టమైన పనులు నేర్చుకోవడం వంటివన్నీ చేసేస్తున్నారు.
లేడీ అమితాబ్ విజయశాంతి కి మహేష్ బర్త్ డే శుభాకాంక్షలు
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయ శాంతి ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. అత్యధిక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి విజయ శాంతి రికార్డ్ క్రియేట్ చేశారు . 3 దశాబ్దాల సినీ కెరీర్ లో 180 మూవీస్ కు పైగా నటించి, ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ హోదాను విజయశాంతి దక్కించుకున్నారు. హీరోలతో పోటీపడి రెమ్యునరేషన్ అందుకున్న విజయశాంతి "నాయుడమ్మ "మూవీ (2006 ) తరువాత సినిమాలకు దూరం అయ్యారు.
హీరో కృష్ణ కు మహేష్ బాబు ఫాదర్స్ డే శుభాకాంక్షలు
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫాదర్ హీరో కృష్ణ కు ఫాదర్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ తరువాత మహేష్ బాబు , సూపర్ హిట్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశు రామ్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

OFFICIAL..పరుశురాంతోనే మహేష్ సినిమా
ఒకదాని తర్వాత ఒకటి మహేష్ బాబు ఫ్యాన్స్ కు సర్పరైజ్ ఇస్తున్నారు. రేపు ఆయన తన అభిమానులతో ముచ్చటించనున్నట్టు ఇప్పటికే తెలిపారు. రేపు సూపర్ కృష్ణ పుట్టినరోజు కావడంతో మహేష్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ లో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం మొదలుకానుంది.

మహేష్ బాబు పర్సనల్ జిమ్
"భరత్ అనే నేను", "మహర్షి ", "సరిలేరు నీకెవ్వరు " వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని తన ఇంటిలో మహేష్ బాబు పర్సనల్ జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ తన జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తారు.