
ట్యాగ్ · 45 కథనాలు · పేజీ 3


సెన్సార్ పూర్తి చేసుకున్న 'సూపర్ మచ్చి'

సంక్రాంతి బరిలోనే 'రౌడీ బాయ్స్'.. రిలీజ్ డేట్ ఫిక్స్

'అతిథి దేవోభవ' ట్రైలర్ రిలీజ్

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు ఇవే..!

'రౌడీ బాయ్స్'.. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుండి టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నహీరో ఆశిష్. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. జనవరి 14న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇక దిల్ రాజు ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కాబట్టి ప్రమోషన్స్ ఏ రకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చూశాం కూడా. ఇంకా రిలీజ్ కు వారం రోజులు ఉంది కాబట్టి ఈ వారం రోజులు గట్టిగానే సినిమా ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే రేపు ట్రైలర్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్…

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సూపర్ మచ్చి'
మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఇప్పటి వరకు అయితే ఒక్క పెద్ద హిట్ సినిమా కూడా పడలేదు. ఇక ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. పులి వాసు దర్శకత్వంలో సూపర్ మచ్చి సినిమాను చేస్తుండగా ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ సంక్రాంతికి ‘సూపర్ మచ్చి’ సినిమాతో రాబోతున్నాడు. సంక్రాంతికి పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈసినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ నెల 14న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి…

సంక్రాంతి బరిలోనే 'రౌడీ బాయ్స్'.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు పేరు ముందే ఉంటుంది. తన బ్యానర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించాడు దిల్‌రాజు, శిరీష్. ఇక ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్ రెడ్డి. హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా రౌడీ బాయ్స్. ఈ సినిమా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల ఈసినిమాకు కూడా చాలా బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా కూడా ఇప్పటికే రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంది. ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

'అతిథి దేవోభవ' ట్రైలర్ రిలీజ్
పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ అతిథి దేవోభవ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో వీలైనంత ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రబృందం. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ అన్నీ ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి…

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు ఇవే..!
సంక్రాంతి వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ లవర్స్ కు మరో పండగలాంటిదే. పెద్ద పెద్ద సినిమాలు చాలా వరకూ సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికే డేట్స్ ను రిజర్వ్ చేసుకుంటాయి. చిన్న సినిమాలు చాలా వరకూ సంక్రాంతి రిలీజ్ లను పెట్టుకోరు. కానీ ఈ ఏడాది సంక్రాంతికి మాత్రం చాలా వరకూ చిన్న సినిమాలే సందడి చేయడానికి సిద్దంగా ఉన్నాయి. దానికి కారణం పెద్ద పెద్ద సినిమాలు అన్నీ పోటీ నుండి బయటకు తప్పుకోవడమే. మరి ఈ సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం..