
ట్యాగ్ · 6 కథనాలు

'కరణం మల్లీశ్వరీ' ఆగిపోలేదు- కోన క్లారిటీ

''12 O క్లాక్'' తో భయపెడతా అంటున్న వర్మ..!
ఆ సినిమాను.. వర్మ ను ఎప్పటికీ మరచిపోను..!

వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ మూవీ

టాలీవుడ్ గురించి కూడా ఆలోచించండి..!
కరోనా వల్ల సినీ పరిశ్రమకు ఎంత నష్టం కలిగిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది కరోనా వల్ల ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. చాలా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్స్ కూడా మూత పడటంతో..సినిమా రిలీజ్ లు అన్ని ఆగిపోవడంతో. ఎలాగోలా ఈ ఏడాది రిలీజ్ చేసుకున్నారు. ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి చాలానే ఉన్నాయి. ఈలోపే మళ్లీ సెకండ్ వేవ్ వచ్చింది. దీంతో పెద్ద సినిమాలు చిన్నసినిమాలు అన్ని ఆగిపోవడంతో వేల కోట్లలోనే నష్టం ఏర్పడింది. పెద్ద సినిమాలు అంటే లేట్ అయినా ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. కానీ చిన్న సినిమాల పరిస్థితి వేరు. అందుకే థియేటర్లు లేవు కాబట్టి ఓటీటీలోనే రిలీజ్…
'కరణం మల్లీశ్వరీ' ఆగిపోలేదు- కోన క్లారిటీ
తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో కరణం మల్లీశ్వరి బయోపిక్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘రాజుగాడు’తో మంచి పేరు తెచ్చుకున్న దర్శకురాలు సంజనా రెడ్డి దర్శకత్వంలో ఈ బయోపిక్ రూపొందుతుంది. ఎప్పుడో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా.

''12 O క్లాక్'' తో భయపెడతా అంటున్న వర్మ..!
హార్రర్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. ఒకప్పుడు 'రాత్రి' 'భూత్' సినిమాలతో ఆడియన్స్ ని భయపెట్టాడు. ఇక ఈ మధ్య కాలంలో వర్మ హార్రర్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. వర్మ నుండి హార్రర్ సినిమా వచ్చి చాలా ఏళ్ళే అయింది. ఇప్ప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి హార్రర్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ ద్వారా ''12 O క్లాక్'' అనే హారర్ మూవీని తీస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ రోజు సాయంత్రం 7 గంటలకి 12 'O' క్లాక్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించనున్నారు.
ఆ సినిమాను.. వర్మ ను ఎప్పటికీ మరచిపోను..!
మొదటి సినిమాను.. రామ్ గోపాల్ వర్మను ఎప్పటికీ మర్చిపోను అంటున్నాడు కోన వెంకట్. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా..? రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సత్య' సినిమా. జె.డి చక్రవర్తి, మనోజ్ బాజ్ పాయ్, ఊర్మిళ, శురభ్ శుక్లా ప్రధాన పాత్రల్లో వచ్చిన సత్య ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. 1998 జులై 3 న వచ్చిన ఈ సినిమా నేటితో 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కోన వెంకట్ తన ట్విట్టర్ ఈ సినిమాను, వర్మను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు. అవకాశం అనేది దేవుడితో సమానం.. అవకాశం ఇచ్చిన వాళ్ళు దేవునికంటే ఎక్కువ.. నాకు అలాంటి అవకాశం ఇచ్చిన వర్మకు, సత్య సినిమాకు నేను ఎప్పుడు కృతజ్ఞుడినే అంటూ పేర్కొన్నాడు.

నిశ్శబ్దం ఫస్ట్ ఛాయస్ థియేటర్.. కానీ పక్షంలో ఓటీటీ..!
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం 'నిశ్శబ్దం'. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా.. అందులోనూ మూగ పాత్రలో చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.

వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ మూవీ
ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మెడల్ అందుకున్న మొదటి భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి. 54 KG విభాగంలో మల్లీశ్వరి వరల్డ్ ఛాంపియన్ షిప్ విన్నర్ గా నిలిచారు. అర్జున అవార్డ్, రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ వంటి పురస్కారాలు మల్లీశ్వరి అందుకున్నారు. ఇప్పుడు మల్లీశ్వరి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రూపొందనుంది.