ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మెడల్ అందుకున్న మొదటి భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి. 54 KG విభాగంలో మల్లీశ్వరి వరల్డ్ ఛాంపియన్ షిప్ విన్నర్ గా నిలిచారు. అర్జున అవార్డ్, రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ వంటి పురస్కారాలు మల్లీశ్వరి అందుకున్నారు. ఇప్పుడు మల్లీశ్వరి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
స్టార్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా నిర్మించాలని ప్లాన్ చేశారు. మల్లీశ్వరి ని సంప్రదించి బయోపిక్ మూవీ హక్కులు కోన వెంకట్ పొందారు. ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ .. కరణం మల్లీశ్వరి బయోపిక్ మూవీ రూపొందనుందని, ఈ మూవీ కై టాలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ మూవీ పై అధికారిక ప్రకటన వెలువడనుందని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































