
ట్యాగ్ · 5 కథనాలు


"కెజిఎఫ్ చాప్టర్ 2 " కు హీరో యష్ డబ్బింగ్ షురూ

ఆర్ఆర్ఆర్ తర్వాత జపాన్ లో కె.జి.యఫ్1, కె.జి.యఫ్2
మన సౌత్ సినిమాల ప్రభావం ఇతర ఇండస్ట్రీలపై ఎంతగా పడిందో చూస్తున్నాం. ప్రస్తుతం అయితే బాలీవుడ్ ను కూడా వెనక్కి నెట్టి సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ ప్రభావం చూపిస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలు అయితే అంతర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. ఇక కొన్ని సినిమాలను విదేశాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయగా అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమాలు సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పుడు మరో ఫ్రాంచైజ్ ప్రభంజనం సృష్టించడానికి సిద్దమవుతుంది. ఆ ఫ్రాంచైజ్ మరేదో కాదు కె.జి.యఫ్1, కె.జి.యఫ్2.

నైజాం లో 5రోజులకు 30 కోట్ల షేర్ తో ఫస్ట్ డబ్బింగ్ మూవీ గా మూవీ
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో 4రోజులలోనే 500 కోట్ల క్లబ్ లో చేరింది. 300 కోట్ల కలెక్షన్స్ తో “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ దూసుకుపోతూ ఫస్ట్ కన్నడ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల లోనూ “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

కె.జి.యఫ్ 2.. రెండు రోజుల్లో 300 కోట్లకు చేరువగా..!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో తమ సత్తాను చాటుతున్నాయో చూస్తునే ఉన్నాం. మరీ ముఖ్యంగా సౌత్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. గత ఏడాది వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా పుష్ప రాజ్ కు ఫిదా ఆయిపోయారు. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా కాబట్టి ఈసినిమాపై ఆటోమేటిక్ గానే ఈసినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఆ అంచనాలను ఆర్ఆర్ఆర్ సినిమా ఏ మాత్రం తగ్గించలేదు. అనుకున్నట్టుగా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.

హ్యాపీ బర్త్ డే అప్పూ సార్... యష్ ఎమోషనల్ పోస్ట్..!
ఇక నేడు పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా తను చివరిగా నటించిన జేమ్స్ సినిమా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పునీత్ ఆఖరి సినిమా కావడంతో ప్రేక్షకులందరూ ఈసినిమాను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు కూడా తమ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారు. ఇక కన్నడ స్టార్ హీరో యష్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

"కెజిఎఫ్ చాప్టర్ 2 " కు హీరో యష్ డబ్బింగ్ షురూ
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ "కెజిఎఫ్ చాప్టర్ 1 "కన్నడ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా "కెజిఎఫ్ చాప్టర్ 1 "మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. "కెజిఎఫ్ చాప్టర్ 1 " మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.