
ట్యాగ్ · 5 కథనాలు


'కె.జి.యఫ్ 2' అందుకే ఆలస్యమవుతుందా

'కె.జి.యఫ్ 2' టీజర్ ఖాతాలో మరో రికార్డ్

'కె.జి.యఫ్ 2' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!
దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఈసినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఎన్నో సినిమాలు రిలీజ్ డేట్లు మార్చుకున్న నేపథ్యంలో ఈసినిమా రిలీజ్ డేట్ కూడా మారుతుందిలే అనుకున్నారు కానీ.. ఇప్పటివరకూ మాత్రం అదే రిలీజ్ డేట్ ను ఉంచారు. మరి రిలీజ్ లోపు ఇదే డేట్ ఉంటుందా లేక వేరే డేట్ మారుతుందా అన్న అనుమానాలు కూడా ఇంకా ఉన్నాయి. ఇక మరోవైపు ప్రమోషన్స్ విషయంలో మాత్రం మేకర్స్ కాస్త స్లోగానే ఉన్నారని చెప్పొచ్చు. ఈసినిమా నుండి ఇప్పటి వరకూ పలు పోస్టర్లు వచ్చాయి. టీజర్ కూడా ఎప్పుడో…

ఫ్యాన్స్ కే ఆప్షన్స్ ఇచ్చిన 'కె.జి.యఫ్ 2' మేకర్స్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా వస్తున్న సినిమా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’కు ఇది సీక్వెల్. ఇక పార్ట్1 సంచలనాలు క్రియేట్ చేయడంతో ఈ సీక్వెల్ పై అదే స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 14నే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'కె.జి.యఫ్ 2' అందుకే ఆలస్యమవుతుందా
ఇండియన్ సినిమాలో ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

200 మిలియన్ వ్యూస్ తో "కె జి ఎఫ్ చాప్టర్ 2 " రికార్డ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “ మూవీ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

'కె.జి.యఫ్ 2' టీజర్ ఖాతాలో మరో రికార్డ్
దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ముందు ప్లేస్ లో ఉంటుంది. అన్ని పరిస్థితులు బావుంటే ఈసినిమా ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేస్తూ బజ్ మాత్రం క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన వెంటనే వైరల్ అవుతుందన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాాజాగా ఈసినిమా టీజర్ మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. యష్ పుట్టిన రోజు సందర్భంగా…