కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

KGF 2 Film

ట్యాగ్ · 5 కథనాలు

సినిమా వార్తలు

హైదరాబాద్ లో స్టార్ హీరో యశ్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ "కెజిఎఫ్ చాప్టర్ 1 " కన్నడ మూవీ సీక్వెల్ "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నేను పూర్తిగా కోలుకున్నా - మీ అందరి వల్లే సాధ్యమైంది

సంజయ్ దత్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే కదా. ఆయనకు ఇటీవలే లంగ్ క్యాన్సర్ అని తెలిసింది. ఈ నేపథ్యంలో గతకొద్ది కాలంగా చికిత్స తీసుకుంటున్నారు కూడా. ఇక క్యాన్సర్ పై సంజూ భాయ్ విజయం సాధించినట్టే తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో యాక్షన్ స్టార్ యశ్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కోలార్ గోల్డ్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ కన్నడ మూవీ "కె జి ఎఫ్ చాప్టర్1 " ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీ నిధి శెట్టి హీరోయిన్ కాగా స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో యశ్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హై లైట్ గా నిలిచింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అధీరా లుక్‌లోకి సంజ‌య్

తాను చేస్తున్న వృత్తి పట్ల తనకు ఎంత డెడికేషన్, ప్యాషన్ ఉందో అర్ధమవుతుంది బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను చూస్తుంటే. ఎందుకంటే ప్రస్తుతం సంజయ్ దత్ కు ఆరోగ్యం బాలేదన్న సంగతి తెలిసిందే. ఇటీవలే లంగ్‌ క్యాన్సర్‌ అని తెలియగా దానికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మరి క్యాన్సర్ ట్రీట్ మెంట్ అంటే చాలా మందికి తెలిసిందే ఎంత వీక్ అయిపోతారో. ఇటీవల సోషల్ మీడియాలో సంజయ్ లుక్ చూసి కూడా చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. ఆయన సన్నగా, క‌ళ్లు లోప‌లికి పోయి, నీరసంగా కనిపించడంతో అందరూ షాకయ్యారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కె.జి.ఎఫ్2 - నవంబర్ నుండి షూట్ లో సంజ‌య్ ద‌త్..!

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ గత కొద్దికాలంగా క్యాన్స‌ర్ కు చికిత్స చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అటు ట్రీట్ మెంట్ తీసుకుంటూనే మరో వైపు షూటింగ్ లకు కూడా హాజరవుతూ దర్శక నిర్మాతలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్ర‌స్తుతం శంషెరా చిత్రానికి డ‌బ్బింగ్ చెప్పే పనిలో వున్నాడు. ఇక హిందీలో పలు సినిమాల్లో నటిస్తుండగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కె.జి.ఎఫ్2 లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అధీరా అనే ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్