
ట్యాగ్ · 7 కథనాలు


హిందీ 'జెర్సీ' ట్రైలర్ రిలీజ్

హీరో నాని పై షాహిద్ కపూర్ ప్రశంసలు

'నాని' ఏడిపించేశాడు

అర్జున్ కథకు 2ఏళ్లు

3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నాని "జెర్సీ"
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని , శ్రద్ధ శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ ” మూవీ 2019 ఏప్రిల్ 19 వతేది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తన సహజమైన నటనతో నాని సినిమాకు ప్రాణం పోశారు.ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో కళ్ళతో పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. ఈ మూవీ లో హీరో నాని వన్ మ్యాన్ షో తో ప్రేక్షకులను అలరించారు.

హిందీ 'జెర్సీ' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తెలుగు సినిమాలను హిందీ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తెలుగులో హిట్ కొట్టిన జెర్సీ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈసినిమా సెట్స్ పైకి వెళ్లి కూడా దాదాపు రెండేళ్లు అవుతుంది. ఈసినిమా కోసం షాహిద్ కపూర్ క్రికెట్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక షూటింగ్ ప్రారంభమై కొద్దిరోజులు జరుపుకోగా మధ్యలో కరోనా రావడంతో అప్పటినుండి బ్రేక్ పడింది. ఇటీవలే షూటింగ్ ను రీస్టార్ట్ చేసి షూటింగ్ ను ఫినిష్ చేశారు. అంతేకాదు…

హీరో నాని పై షాహిద్ కపూర్ ప్రశంసలు
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నాని ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ గీతా ఆర్ట్స్ , దిల్ రాజు ప్రొడక్షన్స్ , సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడి గా హిందీ రీమేక్ "జెర్సీ" తెరకెక్కుతుంది.

'నాని' ఏడిపించేశాడు
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. 2019 ఏప్రిల్ 19న విడుదలైన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తన న్యాచురల్ నటనతో నవ్విస్తాడు... ఏడిపిస్తాడు అందుకే న్యాచురల్ స్టార్ అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. ఈసినిమాలో కూడా నాని తన ఎమోషన్ తో ప్రేక్షకులను కంటతడి పెట్టిసాడు. నానికి కొడుకుగా చేసిన రోనిత్, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా నటించారు. సత్యరాజ్, రావు రమేష్, ప్రవీణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు…

అర్జున్ కథకు 2ఏళ్లు
టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు.. ఎవరి స్టైల్ వారిది..అందరి నటన ఒకేలా ఉండదు.. ఒకేలా నటించలేరు కూడా. ఇక ఇప్పుడున్న హీరోల్లో కామెడీ అయినా.. ఎమోషనల్ అయినా మనసుకు హత్తుకుపోయేలా తన సహజ నటనతో మెప్పించే హీరో ఎవరైనా వున్నారంటే అది నాని అని చెప్పొచ్చు. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు న్యాచురల్ స్టార్ అనే అవార్డు ఇచ్చారంటేనే అర్థంచేసుకోవచ్చు తన నటన గురించి.
‘జెర్సీ’ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న కరణ్ జోహార్!?
`జెర్సీ`... నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో ఓ మెమరబుల్ ఫిల్మ్. ఈ ఏడాది వేసవికి విడుదలైన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా... బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రం... సగటు ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరి ప్రశంసలను అందుకుంది. ఇదిలా ఉంటే... ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకనిర్మాత ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆ దర్శకనిర్మాత మరెవరో కాదు... కరణ్ జోహార్.

జెర్సీ మూవీ - అదేంటోగానీ ఉన్న పాటుగా సాంగ్ రిలీజ్
మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ఓ వైవిధ్యమైన కథ జెర్సీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 19వ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసింది. అదేంటోగానీ ఉన్నపాటుగా అన్న సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.