
ట్యాగ్ · 5 కథనాలు


'ఎన్టీఆర్' 21 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో పాత్రలు

మళ్ళీ "జనతా గ్యారేజ్ "లుక్ లో ఎన్టీఆర్

అరుదైన స్నేహితుడికి హ్యాపీ బర్త్ డే

డబల్ హ్యాట్రిక్ తో ఎన్టీఆర్ రికార్డ్
“నిన్ను చూడాలని “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ “స్టూడెంట్ నెం 1” తో కమర్షియల్ హీరోగా మారారు. "ఆది ", "సింహాద్రి ", "సాంబ ", ", యమదొంగ " , బృందావనం" వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా మారారు. తరువాత ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన కొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి.

'ఎన్టీఆర్' 21 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో పాత్రలు
సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. అయితే వారసులు గా ఎంట్రీ అయితే ఈజీగా ఉంటుంది కానీ వాళ్లకే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటారు.. ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయితే ఓకే కానీ అవ్వకపోతే మాత్రం ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో కొనసాగడం అనేది కష్టమే. అలాంటిది నట సార్వభౌముడు ఎన్టీఆర్ పోలీకలు పుణికి పుచ్చుకొని.. జూనియర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇవ్వాలంటే ఇంకా ఏ రేంజ్ లో ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనపై పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం ఒమ్ము చేయలేదు. తాతకు తగ్గ మనవడు అనిపించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా…

మళ్ళీ "జనతా గ్యారేజ్ "లుక్ లో ఎన్టీఆర్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , తారాగణం తో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమురం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ ఆ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. యువ సుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "#NTR30"మూవీ కి హీరో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

పోల్ గేమ్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కాజల్ అగర్వాల్ జోడీ బెస్ట్ మూవీ ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ , సమంత , కాజల్ ప్రధాన పాత్రలలో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ "బృందావనం "మూవీ ఘనవిజయం సాధించింది. హీరో ఎన్టీఆర్ తన డైలాగ్ డెలివరీ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాజల్ భూమి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.

అరుదైన స్నేహితుడికి హ్యాపీ బర్త్ డే
ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్స్ ఉన్నా ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ కొరటాల శివ. రాజమౌళి లాగే కొరటాల కూడా హిట్ సినిమాల దర్శకుడిగా తన మార్క్ ను చూపిస్తున్నాడు. రచయిత నుండి దర్శకుడిగా మారిన శివ ప్రభాస్ తో మిర్చి తీసి మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు. ఇప్పటివరకూ మూడు సినిమాలు తీయగా మూడు సినిమాలు కూడా సూపర్ హిట్టయ్యాయి.