కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Sudheer Babu

ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

సూపర్ స్టార్ ఫ్యామిలీ అంతా ఒకేచోట

సూపర్ స్టార్ ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉండటం ఎప్పుడో చాలా రేర్ గా చూస్తాం. ఇక తాజాగా వీరంతా ఒకటే చోట కలుసుకోవడం జరిగింది. ఇంతకీ ఏ సందర్భంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఈ రోజు కృష్ణ చిన్న కుమార్తె, హీరో సుధీర్‌ బాబు భార్య ప్రియదర్శిని పుట్టినరోజు. ఈ సందర్భంగా ‌ ఫ్యామిలీ అంతా సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్‌లో సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌, నమ్రత, సంజయ్‌ స్వరూప్‌, జయదేవ్‌, సుధీర్‌బాబు అందరూ పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేయడంతో పాటు అందరూ కలిసి భోజనం చేశారు. ఇక ఈ విషయం సుధీర్‌బాబు ట్విట్టర్‌ ద్వారా తెలియచేసారు. "ఈరోజు నా లైఫ్‌ పుట్టినరోజు. హ్యాపీ బర్త్‌డే ప్రియా" అనే మెసేజ్‌తో పాటు ఫ్యామిలీ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిట్టి బాబు లాంటి పాత్రలో సుధీర్ బాబు ..!

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు కాంబినేష‌న్ లో వ‌చ్చిన ‘వి’ మూవీ ఇటీవలే అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన సుధీర్ బాబుకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటివరకూ కాస్త ల‌వ‌ర్ బాయ్ రోల్స్ లో క‌నిపించిన సుధీర్ బాబుకు ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హీరోగా మారడానికి బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'వి' సినిమా చూసి మా పేరెంట్స్ హ్యాపీ

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ అయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. తాజాగా వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఓటీటీలో సెప్టెంబర్ 05 న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రతి సినిమా విడుదలకు ఒక మొక్క నాటుతా..!

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ రోజురోజుకు వేగంగా వ్యాపిస్తుంది. మొదట ఆయన మొక్కలు నాటి ఛాలెంజ్ విసరడంతో అది రోజురోజుకు దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా ఈ ఛాలెంజ్ ను సుధీర్ బాబు స్వీకరించాడు. హీరో నవీన్ కృష్ణ సుధీర్ బాబుకు ఛాలెంజ్ విసరగా ఛాలెంజ్‌ను స్వీకరించిన సుధీర్ బాబు ఈ రోజు తన నివాసంలో మొక్కలు నాటారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సుధీర్ బాబు స్వీట్ మెమొరీ

ఆంధ్ర ప్రదేశ్ లో నెంబర్ వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా నిలిచిన సుధీర్ బాబు , బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తో డబుల్స్ పార్టనర్ గా వ్యవహరించారు. సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో నటుడిగా టాలీవుడ్ లో ప్రవేశించిన సుధీర్ బాబు "శివ మనసు లో శృతి " మూవీ తో హీరోగా మారారు. "ప్రేమ కథా చిత్రమ్ ", "సమ్మోహనం ", "నన్ను దోచుకుందువటే " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "బాఘీ" మూవీ తో సుధీర్ బాబు ప్రతినాయకుడిగా బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

Team TFNవాట్సాప్
Tollywood Actor Sudheer Babu Shares Interesting News About V Movie
సినిమా వార్తలు

‘వి’ గురించి సుధీర్ బాబు ఆసక్తికరమైన కబుర్లు

యువ కథానాయకుడు సుధీర్ బాబుకి అచ్చొచ్చిన దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. వీరిద్దరి కలయికలో రూపొందిన ‘సమ్మోహనం’(2018) కుటుంబ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఆ చిత్రమే ‘వి’. ఉగాదికి విడుదల కావాల్సిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్

షేర్