
ట్యాగ్ · 5 కథనాలు


'గల్లీ రౌడీ' రిలీజ్ డేట్ వాయిదా..!

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'గల్లీ రౌడీ'

థియేటర్స్ లోనే "గల్లీ రౌడీ "

'గల్లీ రౌడీ' టీజర్ రిలీజ్

'గల్లీ రౌడీ' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
సందీప్ కిషన్ హీరోగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'గల్లీ రౌడీ'. ఇక ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనెల 11వ తేదీ సాయంత్రం 5:04 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. అంతేకాదు మెగాస్టార్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనుండా.. 'గల్లీ రౌడీ' ట్రైలర్ ను లాంచ్ చేయనున్న 'స్టేట్ రౌడీ' అంటూ పోస్టర్ ను కూడా వదిలారు.

'గల్లీ రౌడీ' రిలీజ్ డేట్ వాయిదా..!
కరోనా సెకండ్ వేవ్ వల్ల పెండింగ్ లో ఉన్న సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత మంచిది అని మేకర్స్ కూడా తొందరపడుతున్నారు. అందుకే వారానికి దాదాపు అరడజను వరకూ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు పోటీకి సిద్దంగా ఉండగా.. సెప్టెంబర్ 3న కూడా చాలా సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే అదే రోజున చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'గల్లీ రౌడీ'
థియేటర్లు ఓపెన్ అవ్వడంతో సినిమా రిలీజ్ ల సందడి మొదలైంది. ఇక మేకర్స్ కూడా ఏ మాత్రం లేట్ చేయకుండా తమ సినిమాలను వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈనేథ్యంలోనే వారానికి కనీసం అరడజను సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పుడు యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా తన సినిమాకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసేశాడు. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. ఈసినిమా కూడా రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. “గల్లీ రౌడీ” సెప్టెంబర్ 3న రిలీజ్ అవుతున్నట్టు తెలిపారు.

థియేటర్స్ లోనే "గల్లీ రౌడీ "
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం "నరగాసురన్ ", "కసడ తపర "(తమిళ ), "వివాహభోజనంబు" (తెలుగు ) మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన "గల్లీ రౌడీ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో ఎమ్ వి వి సినిమాస్ బ్యానర్ పై జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ , నేహా శెట్టి జంటగా "గల్లీ రౌడీ " మూవీ తెరకెక్కింది. బాబీ సింహా , రాజేంద్ర ప్రసాద్ , పోసాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. చౌరస్తా రామ్ సంగీతం అందించారు.

'గల్లీ రౌడీ' టీజర్ రిలీజ్
వరుస సినిమాలతో యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఏ1 ఎక్స్ ప్రెస్ తో అలరించాడు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా గల్లీ రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మే 21న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారుచిత్రయూనిట్.